- తొలి జీతం ఏజెన్సీలో ఆసుప‌త్రుల‌కు ఇన్వ‌ర్ట‌ర్ల‌కు విరాళం

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .

రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి ఈ ఎన్నికలలో సంచలన విజయం సాధించారు. ఆమె గతంలో ఒక అంగన్వాడి టీచర్ గా ఉండేవారు. ఆమె భర్త తెలుగు యువత నాయకుడు అన్న కారణంతోనే ఆమెను బాగా వేధించారు .. చివరకు ఆమె తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేసి తమకు కావలసిన వారిని ఎమ్మెల్సీ అనంతబాబు మనుషులు అక్కడ టీచర్ గా నియమించుకున్నారు. అదే ఆమెలో పట్టుదలని పెంచింది ... భార్య , భర్తలు ఇద్దరు పూర్తిస్థాయిలో తెలుగుదేశం కోసం పనిచేశారు. వారి పనితీరు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని ఆకర్షించింది.


ఆర్థిక సామర్థ్యం గురించి ఆలోచించకుండా వారికే టికెట్ ఇచ్చారు ... ఎన్నికలలో శిరీష ఘనవిజయం సాధించారు. కేవలం 30 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. అయితే చంద్రబాబు నమ్మకాన్ని శిరీష శ‌మ్ము చేయలేదు ... కష్టపడి మంచి మెజార్టీతో గెలిచారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఆమె తొలి జీతం దాదాపు రెండు లక్షలకు పైగా వచ్చింది .. ఆ డబ్బును తన కుటుంబ ఖర్చులకోసం తీసుకోవాలని శిరీష అనుకోలేదు... గిరిజన ఆసుపత్రులలో ఇన్వర్టర్లు ... బ్యాటరీలు కొనటానికి ఆమె ఆ డబ్బును ఇచ్చేశారు. జీతం రాగానే ఆమె ఇన్వర్టర్లు ... బ్యాటరీలు కొనుగోలు చేసి ఆసుపత్రులకు పంపించారు.


నిజానికి ఎక్కువమంది ఎమ్మెల్యేలు అదే చేస్తారు ... కానీ నిరుపేద ఎమ్మెల్యే అయిన శిరీష దేవి అలా చేయడం మాత్రం చాలా ప్రత్యేకం అని చెప్పాలి. ఆమె చాలా నిరుపేద ... ఆమె ఎమ్మెల్యేగా గెలవటమే చాలామందికి ఆదర్శప్రాయం అని కూడా చెప్పాలి. వైసీపీకి కంచుకోట అయిన రంపచోడవరం నియోజకవర్గంలో అనంత బాబు లాంటి దుర్మార్గులను తట్టుకొని శిరీష ఎమ్మెల్యేగా విజయం సాధించడం అంటే ఆమె గెలుపు మామూలు విజయం కాదని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: