పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ అని బిరుదు ఉంటుంది. సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతూ ఉండడంతో ఆయన అభిమానులు ముద్దుగా ఆయనకు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు. పవన్ అంటే పవర్ అన్నది రియల్ లైఫ్ లో కూడా ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఎంతో పవర్ఫుల్ గా కనిపించారు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకపోయినా ఆయన బ‌లం రెండు ప్రాంతీయ పార్టీలకు ధీటుగా ఉంది.


అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. పవన్ ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గాను ... అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ ... పర్యావరణం ... గ్రామీణ అభివృద్ధి తాగునీటి సరఫరా అడుగులు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా చూస్తున్నారు. అయితే ఆయా శాఖలలో పవన మార్క్ కనిపిస్తుందా ? అన్నదే ఇప్పుడు చర్చ‌గా మారింది. పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా బరువైన శాఖ ఈ శాఖ పూర్తిగా గ్రామీణ వాతావరణంతో కూడుకుని ఉంటుంది. ఈ శాఖలో చాలా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.


ఇక గ్రామీణ తాగునీటి సరఫరాకు సంబంధించి కూడా చాలా అంశాలు కనిపిస్తాయి అటవీ శాఖలో ఎర్రచందనం అనేది కీలకమైన సబ్జెక్టు ... అది అక్రమ రవాణా అవుతుంది. ఆ శాఖ మంత్రిగా ఎర్రచందనం ఉన్న ప్రాంతాలకు వెళ్లి తనిఖీలు చేయవచ్చు.. దాని గురించి ప్రజలకు తెలియజేయవచ్చు. ఇలా పవన్ కళ్యాణ్ కీలకమైన పంచాయితీ రాజ్ .. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఇంకా తనదైన మార్క్‌ చూపించాల్సిన అవసరం ఉంది.


ప్రస్తుతానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా ఆయన సక్సెస్ అయ్యారా లేదా ఉపముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారా అని పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించుకుంటే ఎక్కువమంది ఇంకా ఉపముఖ్యమంత్రిగా మంత్రిగా తనదైన ముద్ర వేయలేదని ... జనసేన అధినేత గానే ఆయన సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో నుంచి దిగిపోవటంలో కీలకపాత్ర పోషించి హీరోగా ఉన్నారని ... ఉపముఖ్యమంత్రిగా .. మంత్రిగా తనదైన మార్క్ చూపించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: