పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా కూడా వారు తమ మూలాలను గుర్తుంచుకుంటారు. ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెడతారు. రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు. ఆమె గతంలో అంగన్‌వాడీ వర్కర్‌. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా టీడీపీ ఆమె కృషిని, అంకితభావాన్ని గుర్తించింది.  

రంపచోడవరం నియోజకవర్గంలో గెలుపొందిన శిరీషా దేవి తనపై పార్టీకి ఉన్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు.  బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆమె చురుగ్గా ప్రజలకు సేవ చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు.  ఇటీవల, ఆమె తన నియోజకవర్గాలకు సహాయం చేయడానికి తన సొంత డబ్బుతో కొత్త అంబులెన్స్‌ను కూడా కొనుగోలు చేశారు.

ప్రపంచ ఆదివాసీల దినోత్సవం అయిన ఆగస్టు 9న అంబులెన్స్ సేవలు ప్రారంభమవుతాయని ఆమె ప్రకటించారు. ఆమె తన మొదటి ఎమ్మెల్యే జీతంతో తన నియోజకవర్గంలోని ఆసుపత్రులకు పరికరాలను విరాళంగా ఇవ్వాలని యోచిస్తోన్నారు. జడ్డంగి, రాజవొమ్మంగి, లాగరాయి గ్రామాల్లోని ఆసుపత్రులకు శిరీష ఇన్‌వర్టర్లు, బ్యాటరీలను అందజేయనున్నారు.  

అవసరాలకు అనుగుణంగా జడ్డంగి ఆసుపత్రికి ఒక బ్యాటరీ, ఒక ఇన్వర్టర్, రాజవొమ్మంగి ఆసుపత్రికి మూడు ఇన్వర్టర్లు, మూడు బ్యాటరీలు, లాగరాయి ఆసుపత్రికి రెండు బ్యాటరీలు అందజేయనున్నారు. తన నియోజకవర్గాలకు నిరంతరం సేవలందిస్తూ రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలకు శిరీష స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

 ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన జీతం తీసుకోకుండా ఏపీ ప్రజలకు కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఇలా తమ జీవితాలను ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. సంక్షేమ పథకాల కింద జగన్ విద్యార్థుల తల్లులకు, ఆటో డ్రైవర్లకు చిరు వ్యాపారులకు బాగానే ఆర్థిక సహాయం చేశారు. వాలంటీర్ల చేత ప్రజలు బయట అడుగు పెట్టకుండా అన్ని సంక్షేమ పథకాలను అందించారు అయితే జగన్ కంటే గొప్పగా ప్రజలను ఆదుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి కూడా చేయడానికి చంద్రబాబు అండ్ టీం ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: