టిడిపి కూటమి గెలిచిన తర్వాత వైసీపీ కార్యకర్తలకు నేతలకు లీడర్లకు కష్టకాలం మొదలయ్యింది. వైసీపీ వారిని కొట్టాలి లేదా చంపాలి. లేదంటే ఏదో ఒకటి చేసేయాలి అన్న కసి కొంతమందిలో కనిపిస్తోంది. అందుకే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వైసీపీ నాయకులు పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. హింసాత్మక ఘటనలను వివిధ రకాల అన్యాయాలను సాక్షి పత్రిక బయటపెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది అప్పుడే వైసీపీ సపోటార్లు పడే నరకం బయట ప్రపంచానికి తెలుస్తుంది.

అనకాపల్లి జిల్లా, కాసింకోట గ్రామంలోని జగనన్న కాలనీలో ఒక వైసీపీ కార్యకర్త ఇంటిని టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ కాలనీలో వైసీపీ సానుభూతిపరుడు బండారు నరేష్ ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు అయితే దానిపై టీడీపీ శ్రేణులు రెండు జెసిబిలతో దాడి చేయించి దాన్ని నాశనం చేశారు.

 అన్నమయ్య జిల్లా కేవీ పల్లి జడ్పీటీసీ సభ్యురాలు గజ్జల శృతి ఇంటి మీద కూడా దాడి జరిగింది.  శృతి తన భర్త శ్రీనివాస్ తో కలిసి బయటికి వెళ్లిన సమయంలో టిడిపి శ్రేణులు ఇంటిపై అటాక్ చేశారు. ఈ దాడిలో వారి ఇంటి అద్దాలన్నీ కూడా ధ్వంశమయ్యాయి తర్వాత వారి కారుషెడ్ పై కూడా వీళ్లు దాడులు చేయడంతో అది నేలమట్టం అయ్యింది. గాలి రెడ్డి నాయుడు కొడుకు గాలి ఆనందరావు ఈ దాడులకు పాల్పడ్డాడు. కుమార్ జయ రామ నాయుడు ప్రమేయం కూడా ఉంది. వైసీపీ కార్యకర్త తారకనాథ్ రెడ్డిని కూడా వీళ్లు కొట్టి గాయపరిచారు. తర్వాత కారులో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మండలంలో ఉప సర్పంచ్ శేషగిరిని స్మశానంకి వెళ్లేదారిలో పట్టుకుని చితకబాదుడు బాదినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత విజయ నరసింహారెడ్డి అతని అనుచరులు శేషగిరిని కొట్టినట్లు స్థానికులు తెలుపుతున్నారు. జడ్పిటిసి సభ్యుడు భాస్కర్ కేశగిరి నీ కొడుతున్నప్పుడు అడ్డు వచ్చాడు అయితే అతడిని కూడా వీర కొట్టుడు కొట్టారు. ఇలా వైసీపీ నేతలను టీడీపీ వాళ్లను వెంటాడి మరీ చితకబాదుడు బాదుతున్నారు అంతేకాకుండా వాళ్లు ఇంటిని ఫంక్షన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: