- త్వరలో వారసుల ఎంట్రీ..
- నల్గొండ రాజకీయాల్లో ఈ బ్రదర్స్ దే సంచలనం..
- ఓటమెరుగని అన్నదమ్ములు..


ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. ఇక్కడి పాలిటిక్స్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది  కోమటిరెడ్డి వెంకటరెడ్డి  కుటుంబీకులే. మొత్తం నల్గొండ జిల్లాను  వారి చేతుల్లో పెట్టుకున్నారు. అలాంటి ఈ బ్రదర్స్  రాజకీయాల్లో కానీ సామాజిక కార్యక్రమాల్లో కానీ చురుకుగా పాల్గొంటారు. సహాయం కోసం వచ్చిన వారికి ఆపన్న హస్తము అందించి  ముందుకు నడుస్తారు. అలాంటి కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ప్రస్థానం  గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులను చూస్తే చాలామందికి కుటుంబ రాజకీయ చరిత్ర ఉంది. అలాంటి ఈ తరుణంలో నల్గొండ జిల్లా రాజకీయాల్లో కూడా రాటు తేలినటువంటి  రాజకీయ నాయకుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చాలా పేరు పొందారు.  ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ఎంట్రీ ఇస్తే ఆయన ఆయన వారసత్వాన్ని పట్టుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.


త్వరలో వీరి వారసులు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయిపోతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ది తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి సంచలనం సృష్టించిన నాయకులు. అలనాడు కేసీఆర్ ఆయన ప్రభుత్వంపై విలెక్కుపెట్టిన ఏకైక ప్రత్యర్థులు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలానికి చెందిన ఈ సోదరుల్లో ముందుగా రాజకీయ ఎంట్రీ చేసింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముందుగా యువజన కాంగ్రెస్ లో యాక్టివ్ గా పని చేశారు.  1999 ఎన్నికల్లో  నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే 2004 ఎన్నికల్లో కూడా మరోసారి పోటీ చేసి  విజయం సాధించారు. ఇక 2009 ఎన్నికల్లో మూడవసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని ఆయన అందుకున్నారు. ఇదే సమయంలో తన తమ్ముడు అయినటువంటి రాజగోపాల్ రెడ్డిని కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించారు.

భువనగిరి ఎంపీ స్థానానికి రాజగోపాల్ రెడ్డి మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. 2014లో భువనగిరి ఎంపీ స్థానానికి మరోసారి పోటీ చేసి రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలయ్యారు. కానీ 2015 చివరలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి తన సత్తా చాటారు. ఇద్దరు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన లీడర్లుగా ఎదిగారు. ఇక 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో  ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరో వారసుడు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నా చంద్రమోహన్ రెడ్డి కుమారుడు  చంద్ర పవన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో వీరి రాజకీయ వారసుడిగా తప్పక ఆయన వస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: