ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత.. తన మాకామ్ మొత్తం బెంగళూరుకే మార్చేశారు. ఇప్పుడు చూసిన బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. అక్కడే ఉన్న ప్యాలెస్ లో జగన్ మోహన్ రెడ్డి... తన సతీమణి భారతితో ఉంటున్నారు. ఎవరూ లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి.


అయితే... 2009 కంటే ముందు.. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎక్కువగా కనిపించేవారు.  ఎప్పుడైతే ఎంపీగా విజయం సాధించారో.. అప్పటినుంచి... ఎక్కువగా హైదరాబాదులోని లోటస్ పాండులో  జగన్మోహన్ రెడ్డి కనిపించారు. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత... కూడా లోటస్ పాండు లోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయినప్పుడు కూడా... లోటస్ పాండ్  లో ఉంటూ ఏపీకి వచ్చేవారు.


ఇక 2019 ఎన్నికల కంటే ముందు... తాడేపల్లి లో కొత్త ఇల్లు కట్టుకున్నారు జగన్. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.... పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాడేపల్లి లోనే జగన్మోహన్ రెడ్డి  సెటిల్ కావడం జరిగింది. అక్కడే తన కుటుంబంతో ఐదు సంవత్సరాల పాటు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో విశాఖలో కూడా... ఓ పాలస్ కట్టుకున్నారు. వాసవానికి ఏపీ ముఖ్యమంత్రి ఎవరున్నా ఈ ఫ్యాన్స్ లో ఉండేలా జగన్ మోహన్ రెడ్డి... విశాఖలో కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది.

 

కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో... తాడేపల్లి కార్యాలయాన్ని ఖాళీ చేసి బెంగళూరు వెళ్ళిపోయారు. అయితే ఏపీకి బెంగళూరు కంటే హైదరాబాద్ దగ్గర. కానీ బెంగళూరు లోనే జగన్ ఉండడానికి కారణం వైయస్ షర్మిల అని తెలుస్తోంది. ప్రస్తుతం లోటస్ పాండు లోనే వైయస్ షర్మిల ఉంటున్నారు.తన చెల్లి దగ్గర.. మళ్లీ ఉండటం చాలా తప్పు అని భావిస్తున్నారట జగన్. ఆమంటే ద్వేషిస్తున్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు  లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: