- జ‌గ‌న్ ను క‌లిసేందుకు సొంత పార్టీ కీల‌క నేత‌ల అష్ట క‌ష్టాలు
- వ్య‌క్తిగ‌త దాడుల‌ను రాజ‌కీయ దాడులుగా చూపుతున్న వైసీపీ అధినేత‌
- ప్ర‌జా పోరాటాలు మానేసి తాడేప‌ల్లి టు బెంగ‌ళూరు చుట్టూ ప్ర‌ద‌క్షి ణ‌లు . .

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .
జగన్ సార్ ఎవరిని కలవరు .. ఎవరు ఆయన దగ్గరకు రావద్దు ... ఇది జగన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ కానీ ఆయన పిఏ లు కానీ వైసీపీ నేతలు వైసిపి కీలక నేతలు ... వైసిపి కార్యకర్తలకు చెబుతున్న మాట. జగన్ బెంగుళూరు నుంచి రావడానికి కొంతమంది వైసిపి నేతలపై దాడులు జరగాలి ... వారిని పరామర్శించేందుకు రావాలి ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా లోని జగ్గయ్యపేటలో వైసిపి నేతలపై వ్యక్తిగత అంశాల నేప‌థ్యం లో జరిగిన దాడులను రాజకీయంగా మార్చేందుకు జగన్ మరోసారి బెంగళూరు నుంచి వస్తున్నారు. వినుకొండ తరహాలో నిందితులు కూడా వైసీపీలో ఉండి టిడిపిలోకి వచ్చినవారే అయినా జగన్ కు కావలసిన ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి బెంగళూరు నుంచి వస్తున్నారు.


రెండు రోజులపాటు ఆయన తాడేపల్లి విడిది చేస్తారు. మంగళవారం సాయంత్రం నేరుగా బెంగళూరు నుంచి వచ్చి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి బుధ .. గురువారాలలో తాడేప‌ల్లి ప్యాలెస్ లో విడుదచేస్తారు.. ఎందుకైనా మంచిదని కార్యకర్తలు ఎవరు రావద్దు అని కూడా సమాచారం ఇప్పటికే పంపారు. ఎందుకంటే జగన్ ఎవరిని కలవరు... రెండు రోజులపాటు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాత్రమే సమావేశం అవుతారట. అంతకుమించి జగన్ సొంత పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు ... ఎవరిని కలవరు సార్ చాలా బిజీ అన్న సమాధానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: