- మంత్రి గొట్టిపాటి రాయభారం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. వైసీపీ నుంచి పోటీ చేసిన పలువురు ప్రముఖులు ఎన్నికలలో ఓడిపోయారు. వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇక వైసిపి నుంచి కచ్చితంగా సీటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు కీలక నేతలు ... సీనియర్ నేతలకు జగన్ టికెట్లు ఇవ్వలేదు. అలాంటి వారిలో టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కుటుంబం కూడా ఉంది. సిద్ధ రాఘవరావు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ని దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబులో ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు 2019 ఎన్నికలలో దర్శి సీటు కాకుండా ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాఘవ రావు ఒంగోలు నుంచి పార్లమెంటు కు పోటీ చేసి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం ప్రభుత్వం మారడంతో ఆయన వైసీపీ లోకి వెళ్లిపోయారు. వైసీపీ అధికారం లోకి వచ్చాక సిద్ధా రాఘవ రావు కుటుంబానికే చెందిన వ్యాపారాలు .. గ్రానైట్ వ్యాపారాల పై దాడులు చేశారు. వాటి నుంచి కాపాడుకు నేందుకే ఆయన తన తనయుడు సిద్ధా సుధీర్ బాబుతో కలిసి వైసీపీ లో చేరిపోయారు.
ఇక జగన్ మొన్న ఎన్నికల్లో ఆ ఫ్యామిలీకి దర్శి సీటు ఇస్తారని ఆశలు పెట్టుకుంటే ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం అధికారం లోకి రావడంతో ఇప్పుడు ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ తిరిగి టీడీపీ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ ? బాపట్ల జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మధ్యవర్తిత్వంతో వీరిద్దరు సైకిల్ ఎక్కేందుకు చర్చలు జరుపుతున్నారట.