ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరగడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కి పడ్డారు.. మే 12వ తేదీన తన ప్రియుడు మోహన్ పైన.. తన ప్రేయసి పార్వతి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటనను మనసులో పెట్టుకొని మరి నిన్నటి రోజున సాయంత్రం ప్రియురాలు పార్వతీ పైన పెట్రోల్ పోసినిప్పందించినట్లుగా తెలుస్తోంది మోహన్. అయితే కాలిన గాయాలతో ఉన్నటువంటి ఆమెను చూసిన అక్కడ ఉండే స్థానికులు సైతం వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటన పైన రాయదుర్గం సివిల్ కోర్టు జడ్జి అయిన రమ్య బాధితురాలు అయిన పార్వతీతో వాంగ్మూలాని తీసుకున్నట్లు సమాచారం.
అలాగే సీఐ శ్రీనివాసులు కూడా ఈ విషయం పైన కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నారట.అధికారులు మాత్రం పార్వతి విషయం అత్యంత విషయం గానే ఉందని తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి సంఘటనలు రోజురోజుకీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.. మరి ఇలాంటి విషయాల పైన అటు హోం మంత్రి కానీ ఏపీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇటీ వలే కాలంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన చాలా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో వీటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి