* డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్
* రేవంత్ రెడ్డితో పాటూ చంద్రబాబు చిక్కులు
* ఇప్పటికి ఓటుకు నోటు కేసు టెన్షన్

 

భారతదేశ రాజకీయాలలో... చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు... ఎలాంటి పోలీస్ కేసు లేకుండా కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది లీడర్లు కచ్చితంగా... ఏదో ఒక కేసులో ఇరుక్కుపోతారు. అయితే ఇండియాలో.. పోలీస్ కేసు అయినా లేదా జైలుకు వెళ్లినా కూడా... సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ జనాల్లో సక్సెస్ అవుతూ ఉంటారు.

అలాంటి వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ క్షణమైన అరెస్టు అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన మెడ చుట్టూ ఓటుకు నోటు కేసు  గత ఆరు ఏడు సంవత్సరాలు నుంచి తిరుగుతోంది. 2014 సంవత్సరంలో గులాబీ పార్టీ గెలిచిన తర్వాత... చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి కొన్ని కుట్రలకు తెర లేపడం జరిగింది. గులాబీ పార్టీని, కెసిఆర్ ప్రభుత్వాన్ని వీక్ చేసేందుకు... ఎమ్మెల్సీ ని కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారు.

చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణకు చెందిన సెబాస్టియన్ ను కొనుగోలు చేసేందుకు ప్లాన్ వేశారు.అయితే.. సెబాస్టియన్ కు 50 లక్షలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి దొరికిపోయారు. ఇక ఈ కేసు నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి... జైలు జీవితాన్ని గడిపారు. అటు చంద్రబాబు వాయిస్ కూడా.. ఈ కేసులో కీలకంగా మారింది. ఈ కేసు నుంచి చంద్రబాబు బయటపడ్డారు కానీ రేవంత్ రెడ్డి... ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

 అలాగే గులాబీ పార్టీ పైన 9 సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి.. పోరాటం చేశారు. కెసిఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా... పాదయాత్రలు అలాగే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఇలా అనేక కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో చాలాసార్లు రేవంత్ రెడ్డిని కెసిఆర్ సర్కార్ అరెస్టు చేసింది. కూతురు పెళ్లి కూడా చూడకుండా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఇన్ని అరెస్టుల తర్వాత.. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: