రామకృష్ణా రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచెర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. వై యెస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తన పదవికి , కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2012 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
ఆ తర్వాత 2014 , 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయనను 2019 లో వైఎస్సాఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్‌గా నియమించింది. ఇకపోతే 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే.
ఈ ఎన్నికలలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసిపి పార్టీ నుండి మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు దక్కింది. ఈ ఎన్నికల్లో పిన్నెల్లి , మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్ 202 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ బూత్‌లో జొరబడి ఈవీఎంను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన అక్కడే ఉన్న కెమెరాలో రికార్డు అయ్యింది.
దీని ఆధారంగా అతని మీద ఐపీసీలోని143, 147, 448, 427, 353, 452, 120బి, తోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున తీవ్ర స్థాయి ఘర్షణలు చోటు చేసుకోగా, ఆయనను ఆ రోజున సాయంత్రం గృహనిర్బంధంలో ఉంచారు.
తర్వాత అల్లర్లపై పోలీసుల విచారణ ప్రారంభం కావడంతో 14 నుండి ఆజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుని ఆయన అరెస్టునకు ఆదేశించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇక ఎలక్షన్ రిజల్ట్ వచ్చేవరకు ఈయనను అరెస్టు చేయద్దు అని కోర్టు చెప్పింది.
ఆ తర్వాత ఈయనను అరెస్టు చేశారు. ఇక ప్రస్తుతం ఈయన నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఈయన ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా ఈయన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.