తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన ముందస్తు ఎన్నికలలో 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ దారుణ పరాజయం పాలైంది. ఆ వెంటనే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక వచ్చింది. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉంది. అధికారంలో కాంగ్రెస్ ఉంది... దీంతో బిఆర్ఎస్ గెలవడం కష్టమని అందరూ అనుకున్నారు.. కానీ బిఆర్ఎస్ రంగంలోకి దిగింది. ఓటర్లను క్యాంపులకు తరలించింది ... నేరుగా ఓటింగ్‌కు తీసుకువచ్చింది చివరికి బిఆర్ఎస్ అనుకున్న ఫలితం సాధించింది.
ఇదే స్ఫూర్తిగా జగన్ కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవాలని అనుకుంటున్నారు. అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి పోటీ చేయలేదు.. ఇప్పుడు కూటమి పార్టీలకు అతి తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.. కానీ పార్టీ తిరగలేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అందుకే జగన్ సీనియర్ అయిన బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించి తానే స్వయంగా ఓటర్లతో మాట్లాడటం ప్రారంభించారు.. రెండు రోజులపాటు విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు అందరినీ క్యాంప్ ఆఫీస్ కు తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడ జగన్ తో సమావేశం తర్వాత వారిని క్యాంపులకు తరలించే అవకాశం ఉంది. అయితే ఎంతమంది జగన్ క్యాంప్ ఆఫీసుకు వస్తారు ? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ఎన్నికలకు ముందు ఆ తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు టిడిపి - జనసేన లో చేరారు. విశాఖ కార్పొరేటర్లు వరుస పెట్టి పార్టీ మారిపోతున్నారు. టిడిపి కూడా పార్టీలో చేరితో క్యాంపు ఏర్పాటు చేస్తుంది. ఏది ఏమైనా ఈ కీలకమైన ఎన్నికలలో ఎవరు గెలుస్తారు ? అన్నది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గానే ఉంది.