టీఆర్‌ఎస్‌గా పేరుగాంచిన బీఆర్‌ఎస్ త్వరలో చరిత్రలో నిలిచిపోతుందని, మరికొద్ది రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం కానుందని, ఇకపై తెలంగాణలో కేసీఆర్ పార్టీ స్వతంత్రం కాదని రవిప్రకాశ్ అన్నారు. కవిత అరెస్ట్ అయినప్పటి నుండి BRS-BJP సంకీర్ణం గురించి పుకార్లు వచ్చాయి, వాటిని ఎవరూ నమ్మలేదు కానీ. విలీనంపై రవి ప్రకాష్ చేసిన కామెంట్స్ కి మాత్రం అలా ఇంపార్టెన్స్ లభిస్తోంది. అది నిజమైన ఏమో అని చాలామంది నమ్ముతున్నారు కూడా.
బీఆర్‌ఎస్ బీజేపీ విలీనం అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, రవి ప్రకాష్ చాలా కాన్ఫిడెంట్‌గా ఈ మాటలు చెప్పారు, మరికొన్ని రోజుల్లో విలీనం జరుగుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనమైతే దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఎత్తుగడ అవుతుంది. అయితే బీఆర్‌ఎస్‌తో తెలంగాణలో చేసిన దశాబ్దాల పోరాటాన్ని కేసీఆర్ అంత తేలిగ్గా ముగించేస్తారా? ఢిల్లీ మద్యం కేసు నుంచి కవితకు విముక్తి కల్పించేందుకు ఇదేనా త్యాగమా ? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎంపీ సీట్లు ఈసారి బాగా తగ్గాయి. వచ్చేసారి గెలవాలంటే అందర్నీ కలుపుకో పోవాల్సిందే. అందుకే కేసీఆర్ వస్తే మోడీ కాదనే అవకాశం ఉండకపోవచ్చు. చివరికి ఏమవుతుందనేది తెలియాలంటే కనీసం మూడు నాలుగేళ్లు వెయిట్ చేయాల్సిందే.