ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కార్ అభివృద్ధికార్యక్రమాలను చేపడుతూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కానీ... ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో పడింది. ముఖ్యంగా నిరుపేదలకు పెన్షన్ను పెంచి... ప్రతి నెల ఒకటో తేదీన అందిస్తోంది చంద్రబాబు సర్కార్. సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

 

అయితే ఇలాంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగుతోంది. కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కావడం జరిగింది. అయితే అనుకోకుండా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. నేటి సమావేశంలో పలు కీలక అంశాలపై... చంద్రబాబు కేబినెట్... చర్చించనున్నట్లు సమాచారం అందుతుంది.

 

ముఖ్యంగా స్థానిక సంస్థలు అలాగే సహకార సంఘాల ఎన్నికలపై... కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. స్థానిక సంస్థలు అలాగే సహకార సంఘాలలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోందట చంద్రబాబు కూటమి సర్కార్. దీనిపై ఇవాళ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు అలాగే మత్స్యత్కారులకు నష్టం చేకూరేలా... గత ప్రభుత్వం తీసుకున్న జీవోను కూడా రద్దు చేసే ఛాన్స్ ఉందట.


గతంలో.. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా  వైసీపీ ప్రభుత్వం 217 జీవోను తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను ర ద్దు చేసే దిశగా చంద్రబాబు కేబినెట్ అడుగులు వేస్తోంది. మావోయిస్టులపై నిషేధం పొడగిస్తూ... ఏపీ కేబినెట్లో తీర్మానం చేసే అవకాశం కూడా ఉన్నట్లు వార్త లు వస్తున్నాయి. మరికాసేపట్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అంతే కాదు అమరావతి రాజధాని నిర్మాణం పైన కూడా చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: