ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్.. సమావేశం అత్యవసరంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు నాంది పలికింది చంద్రబాబు కేబినెట్. ఇక ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం... ముందుగా చెప్పినట్లుగానే స్థానిక సంస్థలు అలాగే సహకార సంఘాలలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనే నిబంధనలను తొలగించింది ఏపీ కేబినెట్.

 

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఏపీ కేబినెట్. మంత్రులతో చర్చించిన తర్వాత.. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగిస్తూ... సంచలన నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. అంటే ఇకపై.. ఎన్నికల్లో ఇద్దరే పిల్లలు ఉండాలన్న నిబంధన ఉండదన్నమాట. ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయవచ్చు. ఇక దీనికి సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశంలో పెడతామని... కేబినెట్ ఓ నిర్ణయానికి వచ్చింది.

 అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్  శాఖలో చాలా అవినీతి, అవకతవకలు జరిగినట్లు కేబినెట్లో చర్చ జరిగిందట. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కొత్తది తీసుకురావడం పైన కూడా... ఏపీ మంత్రులు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు త్వరలోనే కొత్త ఎక్సైజ్ పాలసీ కూడా రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నారట.

 అంతేకాదు ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా మత్స్య కార్మికులకు నష్టం చేస్తున్న 217 జీవోను కూడా... చంద్రబాబు కేబినెట్ రద్దు చేయడం జరిగింది. అలాగే మావోయిస్టులపై నిషేధం పొడగిస్తూ కేబినెట్లో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ అలాగే పేరు తొలగించాలని కూడా... చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీలో పథకాలు అమలు చేయడం, రాజధాని నిర్మాణం పై చర్చిచింది చంద్ర బాబు కేబినెట్ .

మరింత సమాచారం తెలుసుకోండి: