తదుపరి విచారణలను నవంబర్ నెలలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటీషన్ పై ఇప్పటికే రెండుసార్లు ధర్మసనం విచారణ కూడా జరిపింది. సిబిఐ దాఖలు చేసిన అప్పుడే వీటిలో అంశాలు షాకింగ్ గా ఉన్నాయని సంజీవ్ కన్నా వ్యాఖ్యనించారు. కేసులో ట్రైల్ ప్రారంభం కాకుండా ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని సంజీవ్ కన్నా ప్రశ్నించారు. ఇప్పటికే ఆరుగురు జడ్జిలు మారిపోయారు .. కొందరు రిటైర్ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సంజీవ్ కన్నా కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని ... ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రైల్ కి సంబంధం లేదని కూడా చెప్పారు. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్ల ను విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని ... ఎలాంటి అడ్డంకి తమకు రావటం లేదని ఈ సందర్భంగా సంజీవ్ కన్నా వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఈ కేసులో సుప్రీం నిర్ణయం ఇప్పుడు వైసీపీ వాళ్లను కాస్త టెన్షన్ పెట్టేస్తోంది.