ఆంధ్రప్రదేశ్ లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను సైతం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చిస్తున్నారు. ఏపీ కేబినెట్ సమావేశంలో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్ల అంశం తెరపైకి వచ్చింది. 


సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించాలంటే పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బొమ్మల పిచ్చితో జగన్ రూ. 700 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలియజేశారు. దీంతో జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ సమావేశంలో ఓకే చెప్పారు. అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానాలు జారీ చేశారు. 

భూముల రీ-సర్వేపై కేబినెట్ లో రెవెన్యూశాఖ నోట్ సమర్పించింది. రీ-సర్వే వల్ల ఏర్పడిన సమస్యలపై కూడా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల భూ యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు తెలియజేశారు. రీ-సర్వే ప్రక్రియను అభయెన్సులో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే స్థానిక సంస్థలు సహకార సంఘంలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధనలను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ మేరకు బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.....


వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలనే నిబంధనలు తప్పిస్తూ బిల్లు పెట్టనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.... ఎన్నికల్లో ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవకతవకలపై కేబినెట్ సమావేశంలో చర్చలు జరిగాయి. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: