* జగన్ కేబినేట్ మంత్రిగా శంకర్ నారాయణ
* ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ నారాయణకు ఎంపీ టికెట్
* ఓటమి తర్వాత అడ్రస్ లేని శంకర్ నారాయణ
* కూటమి వైపు చూస్తున్న శంకర్ నారాయణ
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలు అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. కొంతమంది వైసీపీ నేతల పనితీరు, ఐ ప్యాక్ మాట వినడం, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మొన్నటి ఎన్నికల్లో అత్యంత దారుణంగా వైసిపి పార్టీ ఓడిపోవడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు బహిరంగంగానే స్పందించారు. అయితే కొంతమంది ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం... తమ నియోజకవర్గాలను పట్టించుకోకుండా... సైలెంట్ అయిపోయారు.
దీంతో వైసిపి పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ముఖ్యంగా అనంతపురం ఎంపీగా పోటీ చేసిన శంకర్ నారాయణ... మొన్నటి వరకు పదవులన్నీ అనుభవించి ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయ్యారు. శంకర్ నారాయణ ఓడిపోయిన తర్వాత పక్క పార్టీల వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... ఆయన కేబినెట్లో రోడ్లు అలాగే భవనాల శాఖ మంత్రిగా పని చేశారు శంకర్ నారాయణ.
అయితే ఈయన... 2019లో పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈసారి... శంకర్ నారాయణ కు ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే అనంతపురం టికెట్ శంకర్ నారాయణ కు వరించింది. కానీ దురదృష్టవశాత్తు టీడీపీ చేతిలో శంకర్ నారాయణ ఓడిపోయారు. దాదాపు లక్ష 88 వేల ఓట్ల తేడాతో.... టిడిపి అభ్యర్థి లక్ష్మీనారాయణ వాల్మీకి చేతిలో... శంకర్ నారాయణ ఓడిపోయారు.
అయితే వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత శంకర్ నారాయణ అనంతపురం క్యాడర్ను అసలు పట్టించుకోలేదు. ఓటమి పైన ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు శంకర్ నారాయణ. పదవులన్నీ అనుభవించి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పార్టీకి అండగా ఉండకుండా... పక్క పార్టీల వైపు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారట శంకర్ నారాయణ. దీంతో అనంతపురం లోక్సభ పరిధిలో ఉన్న వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతుందని వార్తలు వస్తున్నాయి.