* హిందూపురం క్యాడర్ ను పట్టించుకోని శాంత
* హిందూపురంలో పార్థసారథి చేతిలో ఓటమి
* ఓటమి తర్వాత హిందూపురంలో కనిపించని శాంత
* బీజేపీ వైపు చూస్తున్న శాంత
హిందూపురం లోక్సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. 2019లో గెలిచిన వైసిపి... 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోవడం జరిగింది. అనుభవం లేని జోలదరాశి శాంత అనే మహిళా అభ్యర్థిని మొన్నటి ఎన్నికల్లో బరిలో దింపారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా హిందూపురం నియోజకవర్గంలో ఎక్కువగా బీసీలు ఉన్న నేపథ్యంలో... శాంతాను బరిలోకి దింపారు జగన్.
శాంతాది బిసి సామాజిక వర్గం. 2009 నుంచి 2014 మధ్యకాలంలో... బిజెపి తరఫున బళ్లారి ఎంపీగా పనిచేశారు శాంత. అలాంటి బిజెపి మూలాలు ఉన్న శాంతాను... హిందూపురం ఎంపీగా నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద సాహసమే చేశారని చెప్పవచ్చు. బోయ సామాజిక ఓటర్లు.. హిందూపురంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారట జగన్.
అలాగే బి శ్రీరాములు సోదరి ఈ శాంత. అయితే అనూహ్యంగా ఎన్నికల్లో మాత్రం... దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో బీకే పార్థసారథి టిడిపి ఎంపీగా హిందూపురం నియోజకవర్గం లో గెలిచారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ శాంత అసలు క్యాడర్ను పట్టించుకోలేదు. ఆమె కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంటున్నారని సమాచారం. దీంతో హిందూపురం వైసిపి నేతలు అందరూ ఆందోళన చెందుతున్నారట.