కొంత కాలం క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. వై సి పి పార్టీ మాత్రం ఒంటరిగా భారీ లోకి దిగింది. ఇక 2019 ఎలక్షన్లలో 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చిన వై సీ పీ పార్టీ ఈ సారి అంతకన్నా ఎక్కువ అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంటాం అని గంభీరంగా చెబుతూ వచ్చింది.
కానీ వైసీపీ కి గోరంగా ఎదురు దెబ్బ తగిలింది. కేవలం ఈ పార్టీకి 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. దానితో ఈ పార్టీకి ఘోర ఓటమి లభించింది. వైసిపి పార్టీకి పెద్ద స్థాయి ఓటమి లభించడంతో ఈ పార్టీకి సంబంధించిన కీలక వ్యక్తులు కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ అయిపోయిన వ్యక్తులలో చెవి రెడ్డి ఒకరు.
ఈయనకు వైసిపి పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాముఖ్యతను తన పార్టీలో ఇచ్చాడు. అందులో భాగంగా ఒంగోలు లో ఈయన పార్టీ బాధ్యతలను చూసుకుంటూ వచ్చాడు. ఇకపోతే ఈ పార్టీ ఓడిపోవడం జరిగింది. దానితో చెవి రెడ్డి కూడా చాలా వరకు సైలెంట్ అయ్యాడు. మరి ఎలక్షన్లు పూర్తయి కొంతకాలమే అవుతుంది.
దాని వల్లే చెవి రెడ్డి సైలెంట్ అయ్యారు అని చాలా మంది భావిస్తున్నారు. మరి కొంత కాలం లోనే చెవి రెడ్డి ప్రజల్లోకి వచ్చి వైసిపి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనప్పటికీ వైసీపీ పార్టీ కొంత కాలం క్రితం జరిగిన ఎలక్షన్లలో పెద్ద స్థాయి ఓటమిని చూడడంతో ఈ పార్టీ కి సంబంధించిన కొంత మంది నాయకులు సైలెంట్ అయ్యారు.