- వైసీపీ కి దూరంగా ఎన్నికల్లో ఓడిన ఎంపీ .. ఎమ్మెల్యే క్యాండెట్లు
( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
నిన్న మొన్నటి వరకు ఇంకా చెప్పాలంటే సాధారణ ఎన్నికలకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి తిరుగులేదు.. ఆ పార్టీ సంస్థాగతంగా తిరుగులేని రాజకీయ శక్తిగా ఉంది. మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడండి పురుగులుండు అన్న చందంగా వైసిపి వాపు చూపించుకొని అదంతా తన బలుపుగా చెప్పుకుంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు తాము ఎంతో బలంగా ఉన్నామంటూ ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఓటమి దెబ్బతో వైసీపీ కుదిలైంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ... 25 పార్లమెంటు స్థానాలలో ఆ పార్టీకి కేవలం 15 స్థానాలు మాత్రమే దక్కాయి. 11 అసెంబ్లీ ... నాలుగు లోక్‌సభ సీట్లలో మాత్రమే వైసిపి విజయం సాధించింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలలు కూడా పూర్తిగా కాకుండానే దాదాపు 100 నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు రాజకీయాలలో యాక్టివ్ గా ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా నియోజకవర్గాలలో మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉండటమో లేదా వైసీపీ నుంచి బయటకు వచ్చేయనున్నారు. ఈ లెక్కన చూస్తే ఏడాదిలోనే వైసీపీ అభ్యర్థుల్లో 50 శాతానికి పైగా నియోజకవర్గాలకు దూరం కానున్నారు.
అదే జరిగితే ఇన్ని నియోజకవర్గాలలో వైసీపీకి తీవ్రమైన నాయకత్వ సమస్య ఎదురు కానుంది. ఇది జగన్కు పెను సవాలు లాంటిది. పైగా వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో నియోజకవర్గాల పునర్ విభజన జరిగి కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఖాళీ అయిన వంద నియోజకవర్గాలకు తోడు కొత్తగా మరో 50 నియోజకవర్గాలలో అభ్యర్థులను వెతుక్కోవటం అంటే జగన్ కు చాలా పెద్ద సవాలు లాంటిది అని చెప్పాలి.