ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... మంత్రి నారా లోకేష్ ఇప్పుడు... హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంటే ఎక్కువగా మార్కులు కొట్టేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అన్నా కష్టం అంటే... అలా వాలిపోతున్నారు నారా లోకేష్. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన.. లేదా నేరుగా నారా లోకేష్ కు సమస్య చెప్పిన... వెంటనే తీర్చుతున్నారు.

 

ఆంధ్రప్రదేశ్లో సమస్యలే కాకుండా విదేశాలలో ఉంటున్న గల్ఫ్ బాధితుల కోసం కూడా కృషి చేస్తున్నారు నారా లోకేష్. ఇప్పటికే ఇద్దరి బాధితులను... ఇండియాకు చేర్చారు నారా లోకేష్.  అందులో కువైట్ వెళ్లిన శివ అనే వ్యక్తిని.. కాపాడి నారా లోకేష్ బాగా పాపులర్ అయ్యారు. మరో వ్యక్తిని కాపాడినా... కువైట్ శివ ఇన్సిడెంట్ మాత్రం బాగా పాపులర్ అయింది. అంతే కాకుండా ఏపీలో ఉన్న విద్యార్థుల సమస్యలను... పట్టించుకోని దగ్గరుండి తీర్చుతున్నారు నారా లోకేష్.

ఈ తరుణంలోనే... తండ్రిని మించిన తనయుడిగా నారా లోకేష్ మారుతున్నారు. మంత్రి నారా లోకేష్ మరో మంచి పని చేశారు.  జమ్మలమడుగు ప్రాంత సమస్యను... నోట్ చేసుకున్న నారా లోకేష్ వారి సమస్యను తీర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు అవుతున్నా... జమ్మలమడుగులో అసలు ఫోన్లకు సిగ్నల్ గా ఉందట. జమ్మలమడుగు వెళ్లిన వెంటనే.. ప్రపంచంతో బంధం తెగిపోతుందట.

 ఆ ఊర్లో 108 కుటుంబాలు అలాగే 400 మంది ఓటర్లు ఉన్నా కూడా గ్రామంలో... సిగ్నల్స్ మాత్రం అందించేందుకు ఏ ప్రభుత్వం సహాయం చేయలేదని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.ఫోన్లో మాట్లాడాలంటే కచ్చితంగా మూడు కిలోమీటర్లు వెళ్లాల్సిందేనని అక్కడి ప్రజలు చెప్పారు.అయితే ఈ సమస్యను ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్  ద్వారా నారా లోకేషన్ తెలిసింది. వెంటనే స్పందించిన నారా లోకేష్.. త్వరలోనే మొబైల్ టవర్ జమ్మలమడుగులో హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: