• ఎన్నికల్లో ఓటమి తర్వాత ఖాళీ అవుతున్న వైసీపీ

• ముందుగా ఎస్కేప్ అవుతున్న ఫైర్ బ్రాండ్స్    

అనిల్ కుమార్ యాదవ్ కనిపించడం లేదు  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

2024 ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాల్లో 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కేవలం 11 సీట్లతో ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత వైసీపీ నేతలు అందరూ కూడా ఆ పార్టీకి దూరమవుతున్నారు. వేరే పార్టీలోకి వెళ్లిపోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జగన్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ షాకిస్తున్నారు. ఆయన ఒకప్పుడు వైసీపీలో చాలా ముఖ్యమైన నేత. ఇప్పుడు మాత్రం టీడీపీలో జాయిన్ అయ్యేలాగా కామెంట్స్ చేస్తున్నారు.

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్లమెంటరీ నియోజకవర్గం నర్సరావుపేట నుంచి అనిల్ కుమార్ పోటీ చేశారు. అయితే ఆయన ఈసారి ఎన్నికల్లో దాదాపు 1,60,000 తేడాతో ఓడిపోయారు. దీని తర్వాత ఆయన వైసీపీ ఓటమి గురించి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అప్పటినుంచి ఇప్పటిదాకా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన దాఖలాలు లేవు.

రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా అనిల్ కుమార్ యాదవ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏపీలో భూతద్దం పెట్టి చూసినా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా ఆయన మాట కూడా వినిపించ‌డం లేదు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో, కౌంటింగ్ డే ముందు కూడా తొడ‌గొట్టి స‌వాళ్లు విసిరారు. మీసం మెలేసి ఎవరు గెలుస్తారో రండి చూసుకుందాం అంటూ భారీ లెవల్లో డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా మారిపోయారు. నోరు మెదిపితే ఎక్కడ కేసు వేసి జైల్లో వేస్తారేమో అని వీరు భయం భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ నుంచి వీళ్లు చల్లగా జారుకుంటున్నారు. అనిల్ కుమార్ యాద‌వ్‌ సైలెంట్ అయిపోతే ఆర్కే రోజా హాయిగా ఫారెన్ వెళ్లిపోయారు.

ఒకప్పుడు అనిల్ తో చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్న నాయకులు, వ్యాపారులు ఇప్పుడు ఆయన ఎవరో మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. నెల్లూరులో, నరసరావుపేటలో ఎక్కడ చూసినా ఇప్పుడు అనిల్‌ బలగం అనేది కనిపించడం లేదు. అనిల్ కుమార్ వర్గంతో పాటు కొడాలి నాని వర్గం కూడా ఎక్కడికి అక్కడ విచ్ఛిన్నమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: