* వైయస్ హయాంలోనూ మంత్రిగా చేసిన మోపిదేవి.!
* ఎన్నికలకు ముందు పార్టీలో ప్రాధాన్యత తగ్గడమే కారణమా.?
* ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంటైన సీనియర్ నాయకుడు.!


(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీగా విజయం సాధించి వైసీపీకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చి కేవలం 11స్థానాలకే పరిమితం చేసింది. అయితే గత రెండు నెలల కూటమి పరిపాలనలో వైసీపీ పార్టీ నేతలపై చాలా వ్యూహత్మక పరిణామాలు చోటుచేసుకోవడంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకుల సైతం వారి ఫ్యూచర్ ఆలోచనలో గట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వారిలో ఒకరైన మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా ఒకరు.మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు జెడ్పిటిసి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు రేపల్లె రాజకీయాలను శాసించిన మోపిదేవి ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.వైసిపి బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి అప్పట్లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి ఎందుకు అలకపూనారో క్యాడర్ కే అంతుపట్టడం లేదు. దీంతో తమ నాయకుడు పొలిటికల్ ఫ్యూచర్ పై ఆందోళనతో ఉన్నారు మోపిదేవి అనుచరులు. వైయస్ హయాంలో మొదట కూచిపూడి నియోజకవర్గం విజయం సాధించిన మోపిదేవి2004, 2009లో వైయస్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత రేపల్లెకుమారిన మోపిదేవి అక్కడ ఒకసారి విజయం సాధించి రెండుసార్లు ఓడిపోయి వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచి జగన్ తో పాటు జైలు పాలయ్యారు. మొదటి నుంచి పార్టీలో మోపిదేవికి మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది వైసీపీ అధిష్టానం. 2014లో ఓడిపోయిన మోపిదేవి 2019 లోను అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓడిపోయారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు అయితే కొన్నాళ్ళకే శాసన మండలి రద్దు కావడంతో మోపిదేవిను, పిల్లి సుభాష్ను రాజ్యసభ ఎంపీలుగా ఢిల్లీ పంపారు.ఈ క్రమంలోని కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మోపిదేవికి బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 

 అయితే 2024 ఎన్నికలకు ముందు నుంచే మోపిదేవికి టికెట్ విషయంలో సందిగ్ధత కొనసాగింది. ఎంపీగా ఉన్న మోపిదేవికి బదులు ఆయన కొడుకు రాజాకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది.మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవిని కాదని గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్ ని వైసిపి బరిలో దించింది. టికెట్ ఇవ్వకపోవడంతో మొదట మనస్థాపానికి చెందిన మోపిదేవి తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డారు. ఎన్నికల్లో వైసిపి పరాజైన తర్వాత మాత్రం మోపిదేవి పార్టీ కార్యక్రమాలు పెద్దగా పాల్గొనట్లేదు. గతంలో ఎప్పుడు నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉండే మోపిదేవి ఎన్నికల తర్వాత ఎవరితోనూ టచ్ లో లేరని తెలుస్తుంది పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరవ్వటం లేదు ప్రస్తుతం ఆయన పార్టీ అధిష్టానంపై కినుకు వహిస్తున్నట్లు ఆయన అనుచరులు అంటున్నారు. అందుకే ఆయన స్థానంలో బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మెరుగు నాగార్జునను అధిష్టానం నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మోపిదేవితో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ వైసీపీలో సరైన ప్రాధాన్యత లేదని ఆయన వర్గం భావిస్తుంది.మోపిదేవి మాత్రం తన మనసులో ఏముందో బయట పెట్టకుండా ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికైనా మోపిదేవి మౌనాన్ని పక్కనపెట్టి మనసులో మాటను చెప్పాలని వైసీపీ నేతలు అంటున్నారు. లేదంటే మోపిదేవి లాంటి సీనియర్ నాయకులు పార్టీకి దూరమైతే ఒక కోల్పోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే దీనిపై జిల్లా సీనియర్ నాయకులు అయిన మోపిదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని జిల్లా నాయకులు మరియు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: