మరి కొందరు మాత్రం పిల్లల పేర్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవాన్ష్ కు అసలు సెక్యూరిటీ లేదని అలాంటప్పుడు ఈ తరహా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులకు అర్హత ఉన్నా వాళ్లు ఎవరూ సెక్యూరిటీ తీసుకోవడం లేదని ఏపీ పోలీసుల నుంచి క్లారిటీ వచ్చేసింది.
అంబటి ఏవైనా ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించి ఆరోపణలు చేస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఈ తరహా ఫేక్ ప్రచారాల వల్ల పరువు పోగొట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా ప్రచారాలకు ఇకనైనా వైసీపీ నేతలు దూరంగా ఉంటే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ ప్రజల సమస్యలపై దృష్టి పెడితే ఈ పరిస్థితి కొంతమేర మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ వేగవంతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీకి అనుకూలంగా మాట్లాడే నేతల సంఖ్య సైతం ఊహించని స్థాయిలో తగ్గిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం జగన్ సైతం విలువలు, విశ్వసనీయత అంటూ మాటలతో చేస్తున్న రాజకీయాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.