తెలంగాణ రాష్ట్రంలో... రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కొంత మంది గులాబీ నేతలు.... కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే... మరి కొంత మంది నేతలు గులాబీ పార్టీని వీడేందుకు భయపడుతున్నారు. గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్తే అనర్హత వేటు పడుతుందని అందరు భయపడుతున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు కేసు నడుస్తోంది. ఏ క్షణమైనా ఆ పదిమంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


అయితే కాంగ్రెస్ వర్సెస్ గులాబీ పార్టీ మధ్య ఇలాంటి సన్నివేశాలు నడుస్తున్న నేపథ్యంలో... తెలంగాణ బిజెపి పార్టీలో కుమ్ములాట మొదలైంది.  తెలంగాణ బిజెపి పార్టీలో కుమ్ములాట కొత్తది ఏమీ కాదు. ప్రతిసారి తెలంగాణ బిజెపి పార్టీలో ఎవరో ఒకరు... వివాదంగా మారుతూ ఉంటారు. అయితే ఈసారి... తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేందుకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యేలుగా వ్యవహారం నడుస్తోంది.  బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయడం లేదట బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం. దీంతో బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారట బీజేపీ ఎమ్మెల్యేలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆఫీసులో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి కూడా రూం ఇవ్వలేదట తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం.

బీజేపీ రాష్ట్ర ఆఫీసులో రుణమాఫీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అయితే... ఈ కార్యక్రమానికి ఒక్క ఎమ్మెల్యేకు కూడా అందలేదట ఆహ్వానం. పార్టీ బ్యానర్లు, పోస్టర్లపై కేవలం కిషన్ రెడ్డి ఫోటో తప్ప వేరే ఎమ్మెల్యేల, ఎంపీల ఫోటోలు వేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్స్ సమావేశానికి ఆహ్వానం అందిన వెళ్లకుండా డుమ్మా కొట్టారట ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు. దీంతో తెలంగాణ బీజేపీలో అంతర్ఘత కుమ్ములాట మొదలైందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp