ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దగ్గరికి కావస్తోంది.  ఇప్పటికే పాలన పరంగా అద్భుతంగా దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం  అన్ని మంత్రి పదవులను కేటాయించింది. ఒకే ఒక్క మంత్రి పదవి భర్తీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకు  ఎంత శాతం కేటాయిస్తారు.. ఈ కేటాయింపు బాగుంటుందా లేకపోతే అన్యాయం జరుగుతుందా అనే వివరాలు చూద్దాం.. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ టిడిపి తో  చర్చలు జరిపి కూటమిగా ఏర్పడింది.అంతే కాదు వారితో బీజేపీని కూడా కలుపుకుంది. ఈ సమయంలో జనసేన అధినేత కేవలం 21 సీట్లు మాత్రమే ఆశించారు. 

ఎక్కువ సీట్లు తీసుకుంటే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే జనసేన బూత్ స్థాయిలో గట్టిగా లేదు. కాబట్టి గెలిచే సీట్లు మాత్రమే తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ 21 సీట్లకు పరిమితమై అన్ని గెలిపించుకున్నారు.  ప్రస్తుతం కూటమి  అధికారంలోకి వచ్చింది. ఇతరులను నామినేటెడ్ పోస్టుల విషయంలో  మాత్రం తప్పకుండా జనసేనకు 33% అవకాశం కల్పించాలని అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం టీడీపీ మిత్ర పక్షాలైనటువంటి జనసేన బిజెపి లకు నామినేటెడ్ పోస్టుల్లో కాని ఇతర పదవుల్లో కానీ కేవలం 18 నుంచి 20% మాత్రమే అవకాశం ఇవ్వబోతున్నారనే వార్త రాసుకొచ్చింది.

 దీన్ని బట్టి చూస్తే మాత్రం 20% కేటాయిస్తే మళ్లీ జనసేన అయిదు శాతం బిజెపికి తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టిడిపి గెలిచిన తర్వాత ఇలా జనసేన ను బిజెపిని సైడ్ చేసే ప్రయత్నం చేస్తుందని, ఎన్నికలకు ముందు 33% ఇస్తామని చెప్పి ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత 20 శాతానికే రెండు పార్టీలను పరిమితం చేయడం సమంజసం కాదని కొంతమంది జనసేన నాయకులు అంటున్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: