నటుడుగా , రాజకీయంగా నందమూరి కుటుంబం నుంచి తారకరత్న మంచి పేరు సంపాదించారు.. అయితే నారా లోకేష్ చేపట్టిన యువ గళం యాత్రలో భాగంగా గుండెపోటు రావడంతో కొద్దిరోజులు హాస్పిటల్ లో ఉండి చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈయన భార్య అలేఖ్య రెడ్డి అప్పటినుంచి ఈమె పేరు బాగా వినిపిస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన భర్తకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది అలేఖ్య రెడ్డి. అలేఖ్య రెడ్డి వైసీపీ నేత విజయసాయిరెడ్డి కుటుంబానికి బంధువు.



తాజాగా అలేఖ్య తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఎమోషనల్ పోస్టును కూడా షేర్ చేసింది అలేఖ్య. వైయస్ షర్మిల దగ్గరుండి మరి అలేఖ్య బర్తడేని సెలబ్రేషన్ చేసినట్లుగా తెలుస్తోంది... షర్మిల అలేఖ్యకు వరుసకు అక్క వరుస అవుతుందట  షర్మిల దగ్గరుండి మరి కేక్ కట్ చేసి అలేఖ్య బర్తడే ని చాలా  సింపుల్ గా చేసినట్టు కనిపిస్తోంది. అలేఖ్య కూడా ఎమోషనల్ అవ్వడంతో షర్మిల ఆమెను హత్తుకొని మరి ఓదార్చింది.



అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా అలేఖ్య షేర్  చేస్తూ.." గత కొన్నేళ్లుగా తన పక్కనే ఉంటానని ప్రామిస్ చేసిన నువ్వు తన మాటని నిలబెట్టుకున్నావ్ అక్క నాకోసం సమయం ఇచ్చి మరి తన బర్తడే సెలబ్రేషన్స్ చేసినందుకు ధన్యవాదాలు.. నాకు ఇలా రాయడానికి కన్నీళ్లు వస్తున్నాయి.. నువ్వు చేసి చిన్న పని కూడా తనకు బ్లెస్సింగులా అనిపిస్తుంది అంటూ తెలిసింది. నువ్వు నాకు ఎంతో స్పెషల్ అని కూడా నేను చెప్పలేను నీ స్థానాన్ని ఎవరూ కూడా రిప్లై చేయగలరు అక్క లవ్ యు అంటూ ఒక ఎమోషనల్ పోస్టును సైతం షేర్ చేసింది". ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నది. తారకరత్న అభిమానులు కూడా ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: