ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది.. ముఖ్యంగా మహిళల పైన, చిన్నారుల పైన  అత్యాచారాలు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. పెద్దా, చిన్నా తేడా లేకుండా చాలామంది మహిళల పైన అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపైన పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది మహిళల కేసులు ఆంధ్రప్రదేశ్ పేరు రోజురోజుకీ వినిపిస్తూ నే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కృష్ణాజిల్లా పెడనలో ఒక దారుణం జరిగింది. ఒక మహిళను ఇంట్లో నిర్బంధించి మరి రెండు రోజులపాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.


పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లాలో పెడనలో అదే ఇంట్లో ఉంటున్న కారే తేజశ్రీ.. మచిలీపట్నంలో  రోల్డ్ గోల్డ్కి కవరింగులు వేస్తూ పని చేసుకుంటూ ఉండేదట.. అయితే పని మీద మచిలీపట్నం వెళ్లే సందర్భంగా వినోద్ కుమార్ అతని స్నేహితుడు దోమపాటి లక్ష్మణరావు పరిచయమయ్యారట. అయితే ఆమెతో పరిచయమేర్పరచుకొని ఉన్నట్లు నటించారట.. ఒక పథకం ప్రకారమే ఆగస్టు మూడవ తేదీన సాయంత్రం ఏడు గంటల సమయంలో పని ముగించుకుని వచ్చిన తేజశ్రీ వినోద్ కుమార్ ఆటో ఎక్కిందట. అంతకుముందే లక్ష్మణరావు ఆటోలో ఉన్నారట.


ఇక ఆమె ఆటోలో కూర్చోవడానికి వచ్చిన సమయంలోనే తేజశ్రీని గట్టిగా పట్టుకొని ఆటోలో  శేరవత్తర్లపల్లిలోకి తన ఇంటికి తీసుకువెళ్లారట. అంతేకాకుండా తేజశ్రీని తన ఇంట్లో బంధించిన తర్వాత ఆమెకు బీరు తాగించి అతని స్నేహితులతో పాటు ఆమె పైన అత్యాచారాలను చేశారట. ఇలా రెండు రోజులపాటు ఆమెను ఇంట్లోనే నిర్బంధించి మరి ఎన్నోసార్లు అత్యాచారం చేసినట్లుగా సమాచారం.. చివరికి ఆమె ఐదవ తేదీ అక్కడి నుంచి తప్పించుకొని ఆమె ఉంటున్న పెడనకు చేరుకున్న తర్వాత తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజురోజుకి ఇలాంటి దారుణాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్నాయని ప్రజలే మాట్లాడుకుంటున్నారట. మరి వీటి పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: