* కూటమిలో చిచ్చు కోసం డేగ కళ్ళతో ఎదురుచూస్తున్న విపక్షం.!
* పార్టీల భవిష్యత్తు కోసం కూటమి అధినేతలు అడ్జస్ట్ అవ్వక తప్పదా.?
(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని కూటమిగా వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ భారీ మెజారిటీ సాధించి వాళ్ళు అనుకున్నట్టుగా వైసీపీను చిత్తు చిత్తుగా ఓడించి 11స్థానాలకే పరిమితం చేశారు. అయితే కూటమి అధికారంలోకి రావడం కోసం మూడు పార్టీల అధినేతలు కూడా ఎన్నికలకు ముందు వ్యూహత్మక ఆలోచన చేశారు.దానికోసం కొంతమందికి పొత్తులో భాగంగా టికెట్ దొరకలేదు దాంతో కూటమి అధికారంలోకి వచ్చాక అలాంటి వాళ్ళను పార్టీ గుర్తిస్తుంది అని ముందే భరోసా ఇవ్వడంతో నేతలు డానికి ఒప్పుకున్నారు.అయితే ప్రస్తుతం కూటమికి ముందు పెద్ద సవాల్ గా నామినేటెడ్ పోస్టుల భర్తీ నిల్చింది. ఎన్నికల్లో అయితే వైసీపీపై కోపంతో కూటమిగా నిల్చి ఓకే మాటపై ఉండి అనుకున్నది సాధించారు కానీ గెలిచినా తర్వాత కూడా ఇదే సఖ్యతతో ఉంటే కూటమిలో ఇబ్బంది ఉండదు కానీ ఒకవేళ ఏదైనా తేడా కొడితే మాత్రం కూటమి అనేది ప్రజల్లో అవహేళనగా మారడం కచ్చితం.అయితే దాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు కూటమిలో ఉన్న మూడు పార్టీలకు తగిన విధంగా సముచిత న్యాయం చేస్తామనన్నారు.ఒకవైపు మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల కోసం సీనియర్లు పట్టుబడుతున్నారు. కీలక నామినేటెడ్ పోస్ట్‌లు కావాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.ఈసారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నారు. సీనియార్టీ, పార్టీకి విధేయులు, యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది.గత ఐదేళ్లు పార్టీ నేతలు పని చేసిన విధానం, ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన పనులు, భవిష్యత్ అవసరాలు, ఇలా చాలా అంశాలను బేరీజు వేసుకొని ఈ పోస్టులు భర్తీకి కసరత్తు చేస్తోంది.అసలు కూటమి పార్టీల మధ్య సర్దుబాటు మెయిన్ టాస్క్‌గా ఉంది. కూటమి ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రత్యర్థులు ఎంతలా కవ్వించినా కూటమి నేతలు ఎక్కడా గీత దాటకుండా పని చేస్తూ వచ్చారు. ఇకపై కూడా అలానే ఉండాలన్న ఆలోచనతో ఉన్నారు.
ఏపీలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండడంతో ఇక్కడ నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎక్కువ సీట్లు గెలుచుకున్న టీడీపీకి అధిక భాగం దక్కనున్నాయి. తర్వాత జనసేనకు ప్రయార్టీ ఉంటుంది. అనంతరం బీజేపీ నేతలకు ఇస్తారు. అయితే అది ఏ నిష్పత్తిలో ఉండాలనేది అసలు మేటర్. దీని కోసం మూడు పార్టీల అగ్రనేతలు ఓ ఫార్ములా ఆలోచించారని సమాచారం అందుతోంది. ఎక్కువ సీట్లు ఉన్న టీడీపీకి 60 శాతం వరకు నామినేటెడ్ పదువులు ఇవ్వాలని తర్వాత జనసేనకు 25 శాతం, బీజేపీకి 15 శాతం పదవులు కట్టబెట్టాలని ఆలోచన చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది.టీడీపీ అధినేత మాత్రం ఎంత శాతం తమకు దక్కినా వాటిలో పార్టీకి ఆయా నేతలు చేసిన పనితీరు ఆధారంగానే పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించారని వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకుంటున్నారని ఆయా ప్రాంతాల్లో కేడర్ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని అంటున్నారు.కాకపోతే ఏ మాత్రం పోస్టులు పంపిణిపై తేడా కొడితే మాత్రం అపుడు కచ్చితంగా కూటమిలో కుంపటి సెగ రగిలినట్లే దాని కోసం డేగ కళ్ళేసుకొని ఎదురుచూస్తున్న విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్లే అవుతుందని రాజకీయా విశ్లేషకుల అంచనా. అలాంటి పరిస్థితి రాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముందు చూపుతో అడుగులు వేస్తారో? లేదా? చూడాలి. అయితే మరో పది రోజుల్లో కసరత్తు తుది దశకు చేరనుంది.