కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహన చట్ట ప్రకారం....ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు మరొక రాష్ట్రంలో తిరగకూడదని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయని గుర్తు చేశారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు. ఆ విషయం తెలియకుండా తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... తెలంగాణ డ్రైవర్ల జోలికి వస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొన్ని క్యాబులు.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో తిరిగి తమ పుట్ట కొడుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము క్యాబులు కొనుగోలు చేసి... తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కటి టాక్స్ కడుతున్నామని... తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు మాత్రం అక్కడి ప్రభుత్వానికి ట్యాక్సీలు చెల్లించి... హైదరాబాదులో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. కొంతమంది దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని మరీ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని క్యాబులు... దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని మరి.. తెలంగాణ వారికి గిరాకి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ఆంధ్రప్రదేశ్ కు వచ్చి... వాహనాలు నడపడం లేదని... మీ రాష్ట్రంలో మీరు నడుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లను కోరారు తెలంగాణ డ్రైవర్లు. ఈ విషయం తెలియకుండా పవన్ కళ్యాణ్ అనవసరంగా...మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అసలు విషయాలు తెలుసుకోకుండా... తెలంగాణ డ్రైవర్లను అంటే అసలు ఒప్పుకోమని... హెచ్చరించారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు.