కేవలం ఒక ఫ్రెండులా, కేర్ టేకర్ల శ్రీను తనతో ఉంటున్నారని చెప్పేసింది మాధురి.. అంతేకాకుండా తాను శ్రీను కూడా కలిసే ఉంటున్నాం అన్నట్లుగా తెలియజేసింది. నిన్నటి రోజున అర్ధరాత్రి ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆయన ఇద్దరు కుమారులు సైతం ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం మరింత హీటెక్కింది. మాధురి, శ్రీను వ్యవహారం గతంలో వైసిపి ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్న సమయంలోనే బయటపడిందట.
అయితే శ్రీనివాస వల్ల కుటుంబం పరువు పోతోందంటూ ఆయన భార్య వాణి కూడా ఆరోపించింది. తన రాజకీయాల వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారని తన భర్త వల్ల ఎలాంటి ఆస్తి రాలేదని కూడా తెలిపింది. అప్పుడు సంచలనం లేపిన ఈ విషయం ఇప్పుడు తాజాగా మాధురి క్లారిటీ ఇచ్చింది. అయితే శ్రీను తాను కలిసి ఉండడానికి ముఖ్య కారణం వీళ్లే.. వీరు సృష్టించినదే అంటూ వాణి పైన ఆరోపణలు చేసింది మాధురి. మొత్తానికి ఇన్ని రోజులు అణిగిమనిగి ఉన్న ఈ వ్యవహారం వెనుక అసలు నిజం ఈరోజు బయటపడింది. అయితే తమది సహజీవనం కాదని కేవలం ఇండస్ట్రీ రిలేషన్ అంటూ తెలియజేసింది. అయితే శ్రీను కూతుర్లు మాత్రం తన తండ్రి కావాలని కోరుకుంటున్నారు. మరి వీటి పైన శ్రీను ఎలా స్పందిస్తారో చూడాలి.