* 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం
* టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల్లో పని చేసిన అనుభవం
* వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి..స్పీకర్ గా పని చేసిన తమ్మినేని
* 2024 ఎన్నికల్లో ఓటమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో... చాలా యాక్టివ్ గా ఉండే రాజకీయ నేతలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తమ్మినేని సీతారాం ఒకరు. వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ కూడా... తమ్మినేని సీతారాం చాలా యాక్టివ్ గా రాజకీయాలు చేస్తారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. అలాంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం... ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మొన్నటి వరకు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు... ఏపీలో చక్రం తిప్పిన తమ్మినేని సీతారాం... 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆముదాలవలస నుంచి దాదాపు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది. వాస్తవంగా ఆయన పొలిటికల్ కెరీర్ తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండేవారు.
అయితే 2009లో టిడిపి పార్టీకి రాజీనామా చేసిన తమ్మినేని సీతారాం... ప్రజారాజ్యంలో చేరిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు తమ్మినేని సీతారాం. కానీ టిడిపిలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2014 సమయంలో వైసీపీలో చేరి... మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి రవికుమార్ చేతిలో..ఓడిపోయిన తమ్మినేని సీతారాం... 2019 సమయంలో మాత్రం విజయం సాధించారు.
అయితే 2019లో గెలిచిన నేపథ్యంలో.. తమ్మినేని సీతారామును స్పీకర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడం... కూన రవికుమార్ గెలవడంతో తమ్మినేని సీతారాం... డీలా పడిపోయారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.ఇలాంటి నేపథ్యంలో... మరికొన్ని రోజుల్లోనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని తమ్మినేని సీతారాం అనుకుంటున్నారట. ఆ దిశగా అడుగులు వేస్తున్నారట మాజీ స్పీకర్.