* మొన్నటి ఎన్నికల్లో బొత్స, ఝాన్సీ ఓటమి
* లాస్ట్‌ ఛాన్స్‌ అంటూ ఎమ్మెల్సీ బరిలో బొత్స
* వైఎస్‌, జగన్‌ కేబినేటి మంత్రిగా పని చేసిన అనుభవం
* సీఎం అయ్యే అవకాశం మిస్‌



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న నేతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. టార్గెట్ చేసి కేసులు పెడుతున్న నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి నేపథ్యంలోనే... వైసీపీలో ఉన్న కొంతమంది సీనియర్ లీడర్లు... మరికొన్ని రోజుల్లోనే రాజకీయాల నుంచి వైదొలిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో.. వైసీపీలో ఉన్న చాలామంది రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.


అలాంటి వారిలో  వైసిపి సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాలలో.. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేతల్లో బొత్స సత్యనారాయణ ఒకరన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన వయసు మీద పడటం... మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం...  కారణంగా వచ్చే ఎన్నికల సమయానికి ఆయన రాజకీయాలకే గుడ్ బై చెప్పే ఛాన్స్ లు ఉన్నాయి. అందుకే ఈసారి ఎమ్మెల్సీ బరిలో నిలిచారట బొత్స సత్యనారాయణ.

 ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గెలిస్తే... ఆయన ఐదు సంవత్సరాల పాటు కచ్చితంగా రాజకీయాల్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ.. ఓడితే.. ఆయన రాజకీయాల నుంచి వైదొలిగే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బొత్స సత్యనారాయణ... అనేక పదవులను అనుభవించారు. 1999 లోనే బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి.. ఎన్డీఏ హవా ఉన్నా కూడా గెలిచారు.

 ఆ తర్వాత 2004 మరియు 2009 సంవత్సరాలలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారు బొత్స సత్యనారాయణ. ముఖ్యంగా 2009 ఆ కాలంలో... వైయస్సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత..  బొత్స సత్యనారాయణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తారని అందరు అనుకున్నారు. కానీ రోశయ్యకు ఆ పదవి దక్కింది. ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైసీపీలో కీలక నాయకుడిగా ఎదిగారు బొత్స సత్యనారాయణ. మొన్నటి ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ అలాగే ఆయన భార్య ఝాన్సీ దారుణంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే.. రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోజనలో బొత్స సత్యనారాయణ ఉన్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: