వైసిపి పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారడం జరిగింది. మాధురి అనే వైసిపి మహిళ నేతతో... దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో... దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఆయన కూతుర్లు ధర్నా చేస్తున్నారు.అయితే ఈ వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాది ముప్పై ఏండ్ల వైవాహిక జీవితమని... గత రెండేళ్లుగా తీవ్ర విభేదాలు నడుస్తున్నాయని చెప్పారు.


ప్రతి రోజూ మా ఇంటిలో గొడవలేనని... నా భార్యకు ఉన్న రాజకీయం కాంక్ష , ఆధిపత్యపొరే కారణం అని వివరించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. నేనే ఎమెల్యే ‌కావాలి , బిజినెస్ నా పేరున ఉండాలని అన్నది అమె కోరిక అని.... పెండ్లి అయిన ఒకటి రెండు ఏండ్లకే ఇది మొదలైందన్నారు. తనకు టిక్కెట్ రాకపొతే నన్ను ఒడిస్తామని అనేదని.... నేను ఐదుసార్లు ఓడిపొవడానికి కారణం నా భార్య వాణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.


నా ప్రధమ శత్రువు భార్య వాణినేనని... విధ్యార్ది రాజకీయల నుంచి పాతికేండ్లుగా ఎన్నొ ఉద్యమాలు చేశాను అని తెలిపారు. పిల్లల్ని నాపై విశనాగుల్లా తయారు చేసిందని...నా మీద శత్రుత్వాన్ని నూరిపోసిందని ఆరోపణలు చేశారు. ఎండ వాన తగలకుండా పిల్లల్ని బంగారంలా పెంచానని... ఇద్దరు పిల్లల్ని డాక్టర్స్ గా చదివించాను. ఏలోటు‌ లెకుండా చుసానని తెలిపారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.


దివ్వల మాధురి అనే మహిళ ట్రాప్ చేయటానికి నెనెం చిన్నపిల్లాడిని కాదని వెల్లడించారు. మాధురికి నేను ఆస్తులు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. నా‌ ఎలక్షన్‌కు రెండు కోట్లు మాధురి ఖర్చు చేసిందన్నారు. నా దగ్గర ఇప్పుడు నయా పైసా లేదు. నేను ఇచ్చే పరిస్దితిలేదని వెల్లడించారు. నాకు రెండు ఏళ్లుగా మాధురి భోజనం పెడుతోందని...వివరించారు. ఇప్పుడు ఆ అన్నం కూడా దొరక్కుండా , నీడ కూడా దొరక్కుండా చేస్తారా అంటూ ప్రశ్నించారు.మాధురితో తన బంధం కాలం నిర్ణయిస్తుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: