కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటాయి . కాక పోతే అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటాయి . ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిపి పొత్తు లో భాగంగా పోటీలోకి దిగగా వై సి పి పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగింది . ఇందులో కూటమి అద్భుతమైన అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది . దానితో తెలుగువ్దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో P4 విధానానికి కార్యచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు గారు సమాజంలో అత్యంత డబ్బు కలిగిన 10 శాతం మంది వ్యక్తులు రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం మంది ప్రజలను ఆదుకోగలిగితే రాష్ట్రంలో పేదరికం నిర్మూలన జరుగుతుంది అని ఈ సమావేశంలో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఇలా సమాజంలో బాగా డబ్బు ఉన్న వారు సమాజంలో పేదరికంలో ఉన్న వారిని ఆదుకోవడం వల్ల పేదరిక నిర్మూలన జరగడం కష్టం అని , ఎందుకు అంటే డబ్బు ఉన్న వారు తాత్కాలికంగా పేదరికంలో ఉన్న వారికి డబ్బులు ఇవ్వడం ద్వారా వారు తాత్కాలికంగా మాత్రమే బాగుంటారు అని అలా కాకుండా వారికి చదువు , వైద్యం , ఉద్యోగాలు , జీవనోపాధి మార్గాలు చూపినట్లు అయితే వారు పేదరికం నుండి శాశ్వతంగా బయటపడతారు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: