జగన్ను చూసి ఇతర రాష్ట్రాలు ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా చేయడం మొదలుపెట్టాయి. వాహనాలు కూడా కొనుగోలు చేశాయి. ఆయన తీసుకొచ్చిన చాలా పథకాలను కొన్ని ఇతర రాష్ట్రాలు కాపీ క్యాట్ చేశాయి. ఎందుకంటే అవి అంత బాగున్నాయి. ప్రజలకు చాలా మేలు చేసే లాగా ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు జగన్ ఏ విధంగా రేషన్ ప్రజలకు ఇంటింటికి అందజేశారో సేమ్ అదే విధానాన్ని ఫాలో అవుతున్నాయి.
అయితే ప్రజలు డీలర్ల వద్దకు వచ్చి రేషన్ తీసుకోలేరా, అన్ని ఇంటి దగ్గరికి వచ్చేస్తే బద్దకస్తులు కారా అని కొంతమంది వాదిస్తున్నారు. ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి చేయదు అనేది వేరే విషయం. కానీ దీన్ని స్వాగతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పేదవాడు ఒకరోజు వేస్ట్ చేసుకోకుండా రేషన్ అనేది ఇంటికి వస్తే బాగుంటుంది. బిజీ పనులు ఉన్నవారికి కూడా చాలా టైమ్స్ సేవ్ అవుతుంది. అంతేకాదు ఇలాంటి సౌకర్యాల వల్ల చాలామందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ప్రభుత్వమే కొద్దిగా ఆర్థిక భారాన్ని ఫేస్ చేస్తుంది కానీ ప్రజలు మాత్రం ప్రయోజనాలే పొందుతారనేది వాస్తవం అందుకే ఇతర రాష్ట్రాలు కూడా ఈ విషయంలో జగన్ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నాయి.