ప్రపంచంలోని ప్రతి దేశం ఆర్థిక వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ దొరికే సహజ వనరులు, ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీలు వ్యాపారాలు, టాలెంటెడ్ పీపుల్ ఆధారంగా ఒక సిటీ ఫైనాన్షియల్ కండిషన్ అనేది మారుతూ ఉంటుంది. తలసరి ఆదాయం అంటే ఒక్కొక్క తల దేశంలో ఎంతమంది సంపాదిస్తుందనే దానిపై ఆధారపడి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందా లేదా బలహీనంగా ఉందా అనేది అర్థం చేసుకోవచ్చు. దీన్నే ఇంగ్లీషులో పర్ క్యాపిటా అంటారు. టోటల్ కంట్రీ ఇన్‌కమ్/టోటల్ పాపులేషన్ = తలసరి ఆదాయం అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ పర్ క్యాపిటా ఉన్న కంట్రీస్ ఎక్కువ సంపన్న దేశాలుగా నిలుస్తుంటాయి. వాటిలో పది దేశాల గురించి తెలుసుకుందాం.
యునైటెడ్ స్టేట్స్
మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్‌లో అమెరికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 813 మంది బిలియనీర్లు ఉండటం. విశేషం.
చైనా
అత్యంత ధనిక దేశాల్లో డ్రాగన్ కంట్రీ సెకండ్ ప్లేస్ లో నిలుస్తోంది. ఈ దేశంలో ఏకంగా 495 మంది బిలియనీర్లు ఉన్నట్టు రిపోర్ట్స్ పేర్కొన్నాయి.
ఇండియా
ధనిక దేశాల్లో ఇండియా కూడా టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. గతేడాది 169 మంది ఉన్న బిలియనీర్ల మనదేశంలో ఉన్నారు అయితే ఈ ఏడాది ఆ ధనికుల సంఖ్య 200కి ఎగబాకింది.
జర్మనీ
ఈ లిస్టులో జర్మనీ 4వ స్థానంలో నిలుస్తోంది. 2023లో 126 మంది ఉన్న బిలియనీర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 132కి పెరిగింది.
రష్యా
అత్యంత సంపన్న దేశాల్లో రష్యా ఫిఫ్త్ రాంక్ సాధించింది. ఇక్కడ 2023లో 105 అపర కుబేరులు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 120కి పెరిగింది.
ఇటలీ 73 మంది కోటీశ్వరులతో 6వ స్థానంలో ఉండగా.. బ్రెజిల్ 69 బిలియనీర్లతో ఏడవ స్థానంలో ఉంది. కెనడా 67 మంది బిలియనీర్లతో 8వ స్థానంలో, హాంకాంగ్ 67 మంది బిలియనీర్లతో 9వ స్థానంలో, ఇంగ్లండ్ 55 మంది అపర కుబేరులతో పదవ స్థానంలో నిలిచాయి.