అప్పులకు వడ్డీలు కట్టడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వద్ద డబ్బులు లేవంటూ లేని అప్పులను కూడా ఉన్నట్టుగా చంద్రబాబు సృష్టిస్తూ మాట్లాడుతూ ఉన్నారట.. రైతు భరోసా ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు, మత్స్యకారుల భరోసా లేదు, ప్రతి ఇంటికి ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు.. మాట కూడా నిలబెట్టుకోలేకపోయారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాలంటరీలను కూడా మోసం చేశారు విత్తనాల కోసం రైతులను నిల్చోబెట్టేలా చేశారు..
ఆంధ్రప్రదేశ్లో లా అండర్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిపోయింది అంటూ కేవలం రెడ్బుక్ రాజ్యమే ఏలుతోందంటూ మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా సాగుతోంది అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అనేక ఆ వాస్తవాలను సైతం గవర్నర్తో చెప్పించారు అంటూ కూడా ఫైర్ అయ్యారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు విద్యంసాలు ఆపేసి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తప్పకుండా అమలు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 నాటికి ఉన్న అప్పులను కూడా లెక్కేసి మరి వివరించినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా అందుకు సంబంధించిన లింకులను కూడా షేర్ చేసి మరి ఏపీ సీఎం చంద్రబాబుకు లెక్కేసి మరి చూపిస్తున్నారు వైసిపి అధినేత.