* ద్వారంపూడి ద్వారంలో దళిత మహిళ బలినా..?
* రాజకీయనేతలకు
డిఎన్ఏ పరీక్షలు షురూ చెయ్యాల్సిందే..!
* బొలిశెట్టి ఆరోపణలకు ద్వారంపూడి సమాధానం..?
( ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పరిపాలనపరంగా దూసుకుపోతూ మరోవైపు గత వైసిపి ప్రభుత్వంలో హడావిడి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. గత వైసిపి ప్రభుత్వంలోని కొంతమంది నేతలు ముఖ్యంగా ఎంపీ గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, సృజన సుకన్య,ద్వారంపూడి, విజయసాయిరెడ్డి, దువ్వాడ... లాంటి నాయకులు వరుసగా వాళ్ళ రాసలీలతో అడ్డంగా బుక్ అవుతున్నారు.వైసిపి ప్రభుత్వ హయాంలో దూకుడు గల నేతల్లో చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. కాకినాడ సిటీ నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చిన ఆయన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.విపక్షాలపై విరుచుకు పడడంలో ముందుండేవారు. ముఖ్యంగా కాకినాడ తీరాన్ని కేంద్రంగా చేసుకొని బియ్యం అక్రమ రవాణా చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ పై చంద్రశేఖర్ రెడ్డి నిత్య విమర్శలు చేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జనసైనికులపై కేసులతో ఉక్కు పాదం మోపారు. దీంతో పవన్ వారాహి యాత్రలో ద్వారంపూడిని టార్గెట్ చేసుకున్నారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేస్తానని హెచ్చరించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో పవన్ అన్నంత పని చేస్తున్నారని అందుకే కాకినాడ తీరం వేదికగా జరుగుతున్న బియ్యం మాఫియా పై ప్రత్యేకంగా పవన్ దృష్టి సారించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉండడంతో ఆయన నిత్య తనిఖీల పేరుతో హల్ చల్ చేస్తున్నారని వాపోతున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ద్వారంపూడికి సంబంధించి బోలిశెట్టి సత్యనారాయణ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారని సహజీవనం అనేది కరెక్టా కాదా అనే విషయం పక్కనపెడితే ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెకు మగ లేదా ఆడ బిడ్డ అని తెలుసుకోడానికి స్కానింగ్ కూడా చేపించినట్లు బోలిశెట్టి అన్నారు.ఆ తర్వాత ఆమెకు డెలివరీ ఎక్కడ చేయించారు, ఆ పుట్టిన బిడ్డకు తలనీలాలు తిరుపతిలో ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పించడం అలాంటివి ద్వారంపూడి చేయడం అనే అంశంపై బోలిశెట్టి ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు నిజం అనేది ద్వారంపూడి చెప్పేదాకా క్లారిటీ అనేది రాదు.అయితే గత సంవత్సరం నుండి ఆమెకు విపరీతంగా బెదిరింపుకు గురి అవుతున్నట్లు కూడా ఆయన అన్నారు.ఎందుకంటే ఆమె నా లైఫ్ నాకు కావాలి నీ భార్యగా గుర్తింపు కావాలని అంటే అది కుదరదన్నట్లుగా ఆయన చేస్తున్న వ్యవహారం ఇంటి బయట 28 కెమెరాలను పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్భంధం చేయడం అలాగే కార్లోనే డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం ఆమె ఎవరికీ ఈ విషయం చెప్పకుండా చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసని బోలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.ఒక మహిళ తన హక్కు గురించి తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదని కేవలం మహిళా తరపున మాత్రమే మా జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మీడియా ద్వారా చెప్తున్నానని అన్నారు.ప్రస్తుతం ద్వారంపూడి పై జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ధుమారాన్ని లేపుతున్నాయి. దాంట్లో భాగంగానే బోలిశెట్టి నిన్న ఈ వీడియో విడుదల చేసి ద్వారంపూడి గుట్టు రట్టు చేసినట్లు తెలుస్తుంది.