కొడాలి నానికి చంద్రబాబు నాయుడు సర్కార్‌ మరో షాక్‌ ఇచ్చింది. గుడివాడ తెదేపా నేతలు, టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులను వెలికి తీసే పనిలో పడింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనరాదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు అధికారంలో ఉండగా ఫోన్ చేసి వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారట.


2022, డిసెంబరు 25న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఉన్న రావి, ఇతర తెలుగు దేశం నేతలపైన కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు తెగబడ్డారట వైసీపీ పార్టీ నేతలు. ఈ ఘటనలో వైసీపీ పార్టీ నాయకులకు పూర్తిగా కొమ్ము కాసి, టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు నమోదు చేశారట అప్పటి సీఐ గోవిందరాజులు. ఇక  వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై వైసీపీ నేత మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్, ఘర్షణ మరో ఇరవై మందిపై 143,144,146,188,427,506 r/w 149 BNS కింద కేసులు నమోదు చేసింది సర్కార్‌.


కే కన్వెన్షన్లో జరిగిన క్యాసినో వ్యవహారంపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ పై జరిగిన దాడులపై విచారణ చేపట్టారు పోలీసులు అధికారులు. కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై 2022, జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ  నేతలపై దాడులు నిర్వహించారు. కార్లు ధ్వంసం, గుడివాడ టిడిపి  కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో చర్యలు తీసుకోలేదు పోలీసులు.



అధికారాన్ని అడ్డం పెట్టుకొని టిడిపి నేతలపైనే కేసులు నమోదు చేశారట పోలీసులు. ఈ ఘటనలో వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ , కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదుకు ఉపక్రమిస్తున్నారు పోలీసులు. అవసరం అయితే... ఈ కేసుల్లో వైసీపీ నేతలను జైలుకు పంపించేందుకు రంగం సిద్ధం చేసింది సర్కార్‌.  మరి ఈ కేసులను వైసీపీ పార్టీ నేతలు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: