ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా పాతుకు పోవాలని.. అడుగులు వేస్తోంది. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ హైదరాబాద్ వస్తున్నది నారా చంద్రబాబు నాయుడు.... శనివారం రోజున ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టిడిపి నేతలతో సమావేశం అయ్యారు.

 

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రకటించారు. నెలలో ప్రతి రెండవ శనివారం... హైదరాబాద్ కు వచ్చి తీరుతానని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు. అతి త్వరలోనే తెలంగాణ టిడిపి అధ్యక్షుని కూడా.. నియామకం చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది.

 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... తెలంగాణ టిడిపి బాధ్యతలను...  ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు  అప్పగించేలా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారట. ప్రస్తుతం నారా లోకేష్ మంచి ఊపులో ఉన్న నేపథ్యంలో...  తెలంగాణ బాధ్యతలను అప్పగిస్తే.. పార్టీ మంచి డెవలప్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. యంగ్ లీడర్ కనుక.. నారా లోకేష్ కు తెలంగాణలో మంచి ఫాలోయింగ్ పెరుగుతుందని కూడా అనుకుంటున్నారట.

 

అంతేకాకుండా నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మీనికి... తెలంగాణ టిడిపి  వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇలా భార్యాభర్తలకు తెలంగాణ టిడిపిని అప్పగిస్తే... వాటికి పూర్వ వైభవం తీసుకువస్తారని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. అయితే అటు గులాబీ పార్టీ కూడా కాస్త బలహీన పడిన నేపథ్యంలో.... మళ్లీ పాత నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేలా రంగం సిద్ధం చేస్తున్నారట. కాగ... గతంలో టీడీపీ పార్టీ నేతలను కేసీఆర్ చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ రివర్స్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: