తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రైతుల సమస్యలు, సాగునీటి అలాగే మంచినీటి సమస్యలు, కరెంటు కోతలు, ఆటో కార్మికుల ధర్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలే నెలకొన్నాయి. కెసిఆర్ ప్రభుత్వంలో.. చాలా హ్యాపీగా ఉన్న తెలంగాణ ప్రజలు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కష్టాలుఅనుభవించడం జరుగుతోంది.


ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి... ఊహించని షాక్ ఇచ్చింది అమర రాజా కంపెనీ.  తెలంగాణలో పెట్టాలనుకున్న తమ కంపెనీ...  వేరే ప్రాంతంలో పెడతామని తాజాగా అమర రాజా కంపెనీ ఛైర్మన్‌ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేసినట్లు సమాచారం. గులాబీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో... పెట్టుబడులు పెట్టేది అమర రాజా కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో అమర రాజా బ్యాటరీ ప్లాంట్ కు.. శంకుస్థాపన కూడా చేశారు.


కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ తతంగం పూర్తయింది. అప్పుడు అమర రాజా కంపెనీకి అనేక హామీలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.... అమరరాజా కంపెనీకి... గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదట కాంగ్రెస్ ప్రభుత్వo. ఈ విషయాన్ని స్వయంగా గల్లా జయదేవ్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.


గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను... రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోతే... తెలంగాణలో విడిచి వెళ్లి పోతామని హెచ్చరించారట. దానికి.. డెడ్ లైన్ కూడా పెట్టారట గల్లా జయదేవ్. ఇక దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. రాజకీయ కక్షలకు వెళ్లి.. మంచి కంపెనీలను తెలంగాణ నుంచి.. తరలిపోయేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమర రాజా కంపెనీ వెళ్లిపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: