ఏ ప్రభుత్వాలు వచ్చిన మధ్యలో ఎవరూ పట్టించుకోలేదు.. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా ఉన్నది, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వము ఉన్నది, రోశయ్య ప్రభుత్వం ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉన్నది.. ఎవరు కూడా పట్టించుకోలేదు.. ఎవరు కూడా వీటి గురించి ఆలోచించలేదు. మీరందరూ కూడా మీరున్నచోట ఇలాంటి జెండాలు ఎగరేయండి అంటూ జాతీయవాదిగా.. జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చెబితే డబ్బులు ఎక్కడున్నాయని పవన్ కళ్యాణ్ ని అడిగారట. అదేంటని కనుక్కోగా ఇలాంటి విషయాలను చెప్పారట.
తక్షణం ఒక్కొక్కరికి మైనర్ పంచాయతీకి పదివేల రూపాయలు.. మేజర్ పంచాయతీకి పాతికవేల రూపాయలు నిధులను అందించారట.. ఒక చక్కటి ఆలోచన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రతి చోటా కూడా జండాలు ఎగరేయడమే కాకుండా అక్కడ కూడా గ్రామస్థాయిలలో మండల స్థాయిలలో వంటి పోటీలు కూడా పెట్టమని చెప్పారట.. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి ఎస్సే రైటింగ్ పోటీలు స్వతంత్ర సమరయోధుల గురించి కూడా పెట్టమని చెప్పారట.. అలాగే స్వాతంత్ర దినోత్సవం గురించి పలు అంశాలకు సంబంధించిన వాటిపైన పోటీలు పెట్టమని సూచించారట. దీని ద్వారా పిల్లలలో మంచి ఫీలింగ్ తీసుకురావాలని ఉద్దేశంతో ఇది ఒక చక్కటి ఆలోచన అని కూడా చెప్పవచ్చు. ఒక నాయకుడు చేయాల్సినటువంటి పని.. దేశభక్తి అనేది విద్యార్థి దశ నుంచి తీసుకురావడం అన్నదే పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం. మరి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేస్తారేమో చూడాలి.