( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినందుకు వేగంగా దూసుకు వెళుతుందని చెప్పాలి. దేశాభివృద్ధిలో నగరాలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి అనటంలో సందేహం లేదు. 2050 నాటికి దేశంలో 100 నగరాల్లో జనాభా 10 లక్షలకు పైగా పెరగనుంది. ప్రస్తుతం ఎనిమిది మెగా సిటీలకు ఇవి అదనం.. పట్టణాభివృద్ధికి ప్రధానంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి అనేది కీలకంగా నిలుస్తుంది. ప్రస్తుతం దేశంలో కొన్ని ముఖ్యమైన నగరాలలో ఒక దశాబ్దం పాటు రియల్ ఎస్టేట్ పరిస్థితులు తిరుగులేని స్పీడుతో దూసుకుపోతాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కొలియర్స్ ఒక నివేదిక తయారు చేసింది.
దేశంలోని 100 నగరాలు ఎమర్జింగ్ సిటీలుగా ఉన్నట్టు కొలియర్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. సమానమైన వృద్ధి రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా ఈ నగరాలను తెలిపింది. మొత్తం పేర్కొన్న 100 నగరాలలో 30 నగరాలలో అధిక వృద్ధిరేటు ఉందని కూడా కొలియర్ స్పష్టం చేసింది. మరి ముఖ్యంగా 17 నగరాలు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి తరగతులలో చాలా స్పీడ్ గా అభివృద్ధి సాధిస్తాయని కూడా పేర్కొంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు నగరాలు చోటు దక్కించుకోవడం విశేషం ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినా తిరుపతి తో పాటు ఉత్తరాంధ్రలో పెద్ద సిటీగా ఉన్న వైజాగ్ ఉన్నాయి. కొలియర్స్ నివేదికలో ఉన్న ఆ 17 నగరాల జాబితాను ఒకసారి చూద్దాం.
- ఉత్తర భారత్ నుంచి అమృత్‌సర్, అయోధ్య, జైపూర్, కాన్పూర్, లఖ్‌నవూ, వారణాసి
- తూర్పు భారత్ నుంచి పట్నా, పూరీ
- పశ్చిమ భారత్ నుంచి ద్వారకా, నాగ్‌పూర్, షిర్డీ, సూరత్
- దక్షిణ భారత్ విషయానికి వస్తే కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇండోర్