- ఏలూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడి రేసులో జెట్టి ..?

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో పార్టీ ఘోర ఓటమి తర్వాత వైసిపి నుంచి ఒక్కొక్క నేత బయటికి వచ్చేస్తున్నారు. ఎన్నికలలో ఎమ్మెల్యేలు .. ఎంపీలుగా పోటీ చేసిన చాలా మంది నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే కిలారు రోశయ్య - పెండెం దొరబాబు తాజాగా ఆళ్ల నాని ఇలా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నేత ... ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను మాజీ డిప్యూటీ సీఎం గానూ ఉన్న ఆళ్ళ నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఆళ్ల నాని వైసీపీని వీడి వెళ్లిపోవడంతో ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవి కూడా ఖాళీ అయిపోయాయి.


ఇప్పుడు ఈ రెండు స్థానాలలో ఎవరు వస్తారు ? అనేదానిపై వైసీపీలో చర్చ జరుగుతుంది. ఏలూరు అసెంబ్లీ స్థానానికి పార్టీ మహిళా నాయకురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నేత జట్టి గురునాథరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గురునాధరావు గతంలో కాంగ్రెస్లో పనిచేశారు. పోల‌వ‌రం మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు.


2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాయబారంతో వైసీపీలో చేరారు. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మెట్ట ప్రాంతంలో సామాజిక వర్గంతో పాటు రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జట్టి గురునాధరావుకు ఏలూరు జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తారని వైసిపి వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: