తాను ఉండగానే తనను తన పిల్లలను వదిలేసిన శ్రీనివాస్ మాధురి అనే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఇటు మాధురి కూడా బయటికి వచ్చి దువ్వాడ వాణి పై తీవ్రమైన ఆరోపణలు చేసిన పరిస్థితి. చివరకు దువ్వాడ శ్రీనివాస్ సైతం మాధురికే తన మద్దతు అంటూ తన భార్యపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా దువ్వాడ శ్రీను - మాధురి విషయం మీడియాలో ఎంత రచ్చ లేపుతుందో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే ఇప్పుడు వైసీపీలో మరో రచ్చ తెరమీదకు వచ్చింది.
కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ దళిత అమ్మాయితో సహజీవనం చేసి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు అని ... ఈ బిడ్డకు ద్వారంపూడి తిరుపతిలో తానే స్వయంగా పుట్టు వెంట్రుకలకు కూడా చేయించాడని ... ఇప్పుడు ఆమెను బయటకు రాకుండా బంధించి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణాలు వస్తున్నాయి. జనసేన నాయకుడు బొలిశెట్టి సత్య ఈ విషయాన్ని ఓపెన్‌గానే చెపుతున్నారు. ఏది ఏమైనా వైసీపీలో అక్రమ సంబంధాలు రాసలీలల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో నానా రచ్చ రచ్చగా మారింది. ఇది పార్టీకి పార్టీ అధినేతకు కూడా పెద్ద ఇబ్బందిగా మారింది.