అయితే 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీ ప్రభుత్వ దాడులు తట్టుకోలేక అయిష్టంగానే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికలలో సిద్ధ రాఘవరావును జగన్ అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ మీద పోటీ చేయించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. వాస్తవంగా సిద్ధ కుటుంబం తమకు దర్శి లేదా ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇస్తుందని ఆశలు పెట్టుకుంది. జగన్ మాత్రం పోటీ చేస్తే గొట్టిపాటి మీదే పోటీ చేయాలి ... మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారు అద్దంకిలో మనకు బలమైన అభ్యర్థి కావాలి అని సిద్ధ కుటుంబం మీద ఒత్తిడి చేశారు. అయితే అద్దంకిలో పోటీ చేసేందుకు సిద్ధ కుటుంబం ఎంత మాత్రం ఇష్టపడలేదు.
దీంతో ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి హనీమీ రెడ్డి అనే పారిశ్రామిక వేత్తను తీసుకువచ్చి అక్కడ పోటీకి పెట్టారు. ఎన్నికలలో హనీమిరెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఒకవేళ అక్కడ సిద్దా కుటుంబ పోటీ చేసి ఉంటే చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో పాటు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వచ్చేది. అలా జగన్ కత్తివేటు బలి నుంచి సిద్ధ కుటుంబం చాలా తెలివిగా తప్పించుకుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు సిద్ధ వైసిపికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన అడుగులు ఇప్పుడు తిరిగి టిడిపి వైపు పడుతున్నాయి.