వారు వయసు తక్కువ చెప్పడం, లేదంటే తాము హ్యాండీక్యాప్ అనే అబద్ధం చెప్పుకుంటూ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలింది. అందుకే వారికి పెన్షన్లు నిలిపివేయనున్నారు. ఇలా డబ్బులు మిగిల్చుకోవడం కూడా సంపద సృష్టించినట్లే అవుతుంది. అలానే బాబు ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ తో రోడ్లు కూడా నిర్మిస్తామని చెప్పారు. అంటే ప్రైవేటు వాళ్లే రోడ్లు నిర్మిస్తారు. అయితే వారు రోడ్ల కోసం పెట్టిన పెట్టుబడిని తిరిగి తీసుకోవడానికి ప్రజల నుంచి టోల్ ట్యాక్స్‌లు వసూలు చేస్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల వాహనదారులు కూడా ఈ రోడ్లపై ప్రయాణిస్తూ ట్యాక్స్‌లు పెడతారు కాబట్టి ఇన్‌కమ్ పెరుగుతుంది.
మెరుగైన రోడ్లు అందుబాటులోకి వస్తాయి కానీ టోల్ ట్యాక్స్‌లు చెల్లించడానికి ప్రజలు పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయరు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వల్ల ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఖజానా మిగిలినట్లే అవుతుంది. డబ్బులు మిగిలించుకోవడమే కాదు పన్నుల రూపంలో కూడా కొంత డబ్బు వస్తుంది. అమ్మ ఒడి పథకాన్ని చంద్రబాబు ఆపేశారు. తల్లికి వందనం అని దానికి పేరు పెట్టారు కానీ ఈ సంవత్సరం ఆ డబ్బులను క్రెడిట్ చేయడం లేదు. దీన్ని ఒక సంవత్సరం పాటు డబ్బులు ఆపు చేశారంటే దీనివల్ల నాలుగు నుంచి ఐదువేల కోట్ల వరకు మిగులుతాయి. ఇది కూడా ఏపీ కోసం సంపద సృష్టించినట్లే అవుతుంది.
రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. స్కూళ్లలో ఇతర యాక్టివిటీస్‌కు ఫండ్స్ రిలీజ్ చేయలేదు. మొత్తం మీద చంద్రబాబు డబ్బులు మిగిల్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మామూలు రోజుల్లో పదిసార్లు పది నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కరెంట్ కట్ చేస్తున్నారు. వారాంతరాలలో నాలుగైదు గంటలు కరెంటు పోతుంది. అంటే మొత్తం మీద ఒక వారంలో 10 గంటల వరకు కరెంటు లేకుండా ఉంటుంది. దీనివల్ల ప్రజల కరెంటు బిల్లులు తగ్గుతాయి. అలాగే ప్రభుత్వం కరెంటు ఎక్కువగా కొనాల్సిన అవసరం లేదు. ఇది కూడా సంపద సృష్టి కిందకి వస్తుంది.