- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) .

వైసిపికి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీని విడుతున్న నేతలు అందరూ వారు ఏ పార్టీలో చేరుతారో ప్రకటించటం లేదు. పార్టీని వీడి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే వారంతా వ్యూహాత్మకంగానే వైసిపికి రాజీనామాలు చేస్తున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతుంది. వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత ముందుగా పార్టీకి రాజీనామా చేసింది. మాజీ మంత్రి రావెల‌ కిషోర్ బాబు ఆ తర్వాత మరో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు - గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు - పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశ‌య్య - పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇలా ఒక్కొక్కరుగా వైసిపిని వీడుతున్నారు.


ఇక వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ... మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ళ నాని కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరందరూ ఏ పార్టీలో చేరటం అన్నది చెప్పకపోయినా ముందు వైసీపీ నుంచి బయటపడటమే మంచిది. అన్న ఉద్దేశంతో రాజీనామాలు చేస్తున్నారన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక వైసిపి ని వీడిన‌ కొంతమంది నేతలు అయితే కూటమి పార్టీలలో చేరాలని అనుకుంటున్నారు. అయితే కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందా ? ఉండదా అన్నదానిపై వీరు తరచు త‌ర్జ‌న భ‌ర్జనలు ప‌డుతున్నారు.


రోజు రోజుకు కూటమి పార్టీలకు ప్రజలలో ఆదరణ పెరుగుతున్నాయి. వైసిపి ఊహించ‌ని విధంగా బలహీనం అవుతోంది. దీంతో ముందు వైసీపీ నుంచి బయటపడితే తాము చాలా సేఫ్‌ అన్నట్టుగా ఆ పార్టీ నుంచి పలువురు బయటకు వచ్చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: